Sudheer babu: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Tuesday,March 02,2021 - 07:56 by Z_CLU

సుధీర్ బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి, బెంచ్‌మార్క్ స్టూడియోస్ ఫిల్మ్ టైటిల్‌.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

‘సమ్మోహనం’, ‘వి’ తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో మూడో చిత్రం రూపోందుతోంది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌ర్శ‌కుడు మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం. ఈ చిత్రానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

త‌న సినిమాల‌కు పెట్టే టైటిల్స్ విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకొని, ఆస‌క్తి రేకెత్తించే తెలుగు టైటిల్స్ పెట్టే మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రోసారి, అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించేలా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే టైటిల్ పెట్టారు.

ఒక వండ‌ర్‌ఫుల్ ల‌వ్ స్టోరీతో, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంద‌ని టైటిల్‌ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ మూవీలో సుధీర్ బాబు స‌ర‌స‌న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

త‌ను ప్రేమించిన అమ్మాయిగా న‌టిస్తోన్న కృతి శెట్టి పాత్ర గురించి సుధీర్ బాబు ఏం చెప్పాల‌నుకుంటున్నార‌నేది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై వస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

నటీనటులు
సుధీర్ బాబు, కృతి శెట్టి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌,
క‌ల్యాణీ న‌ట‌రాజ‌న్.

టెక్నీషియన్స్
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి
నిర్మాత‌లు: బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి
స‌మ‌ర్ప‌ణ‌: గాజుల‌ప‌ల్లి సుధీర్ బాబు
బ్యాన‌ర్‌: బెంచ్‌మార్క్ స్టూడియోస్‌
మ్యూజిక్‌: వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: పి.జి. విందా
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఎడిటింగ్‌: మార్తాండ్ కె. వెంక‌టేష్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, కాస‌ర్ల శ్యామ్‌
కో-డైరెక్ట‌ర్‌: కోట సురేష్‌కుమార్‌