నాగ్ ఈ సినిమా ఒప్పుకోవడానికి ఇదే పెద్ద రీజన్

Wednesday,February 15,2017 - 11:07 by Z_CLU

ఎప్పుడూ లేనిది హారర్ జోనర్ లో సినిమాకి సంతకం చేశాడంటే మ్యాగ్జిమం అక్కినేని ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది. సినిమా సినిమాకి డిఫెరెన్స్ మెయిన్ టైన్ చేసే మన్మధుడు, ఈ సారి కూడా డెఫ్ఫినేట్ గా సం థింగ్ స్పెషల్ చేయబోతున్నాడని. రాజు గారి గది 2 లో నాగార్జున మెంటలిస్ట్ గా ప్రాక్టీస్ చేయబోతున్నాడనే టాక్ సినిమా సెట్స్ పైకి కూడా రాకముందే హీట్ ని జెనెరేట్ చేస్తుంది.

సినిమా యూనిట్ ఈ విషయాన్ని ఎక్కడా అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు కానీ, హై ఎండ్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగార్జున మెంటల్ ప్రాక్టిషనర్ గా సరికొత్త క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయనున్నాడని తెలుస్తుంది. దానికి తోడు ఈ సినిమా కోసం నాగ్ సరికొత్త బైక్ ని కూడా డిజైన్ చేయించుకున్నాడని సమాచారం.

nagarjuna-ohmkar-rajugari-gadi-2-updates

ఫిబ్రవరి 17 నుండి సెట్స్ పైకి రానున్న ఈ సినిమా ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. సమంతా తో పాటు ఓంకార్ తమ్ముడు అశ్విన్, రాజు గారి గది 2 లో కీ రోల్స్ ప్లే చేయనున్నారు.