ఏ మాత్రం తగ్గమంటున్న స్టార్ హీరోయిన్స్

Wednesday,December 04,2019 - 10:02 by Z_CLU

ఇప్పుడిప్పుడే చిన్నగా నిలదొక్కుకుంటున్న హీరోయిన్సే కాదు స్టార్ హీరోయిన్ కూడా వెబ్ సిరీస్ కరియర్ ని సీరియస్ గా తీసుకుంటున్నారు. డిఫెరెంట్ క్యారెక్టర్ ని ప్లే చేసే అవకాశం కోసం కావచ్చు.. OTT ప్లాట్ ఫామ్ కి రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్ కావచ్చు… కారణం ఏదైనా సినిమాలతో పాటు ఈ హీరోయిన్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో కూడా తన ముద్ర వేస్తున్నారు.

తమన్నా : వికటన్ గ్రూప్ ప్రొడ్యూస్ చేస్తున్న ఓ వెబ్ సిరీస్ లో నటించనుంది తమన్నా. ఎగ్జాక్ట్ గా ఇది ఎలాంటి వెబ్ సిరీస్ అన్నది ఇంకా తేలలేదు కానీ, ఫీమేల్ సెంట్రిక్ సిరీస్ అని తెలుస్తుంది.

సమంతా : సక్సెస్ ఫుల్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో నటిస్తుంది సమంతా. ఈ స్టార్ హీరోయిన్ కి కూడా ఇదే డిజిటల్ డెబ్యూ… ఈ సీక్వెల్ లో సమాంత ఉగ్రవాదిలా కనిపించనుంది.

 

ఈషారెబ్బ :  లస్ట్ స్టోరీస్ తెలుగులో నటించనుంది ఈషా రెబ్బ. సిల్వర్ స్క్రీన్ పై తన స్థాయి గ్లామరస్ రోల్స్ రావట్లేదు అని ఫీలయ్యే  ఈషారెబ్బ, ఈ సిరీస్ తో యూత్ కి మరింత దగ్గర కానుంది. సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్.

హన్సిక : ఏ వెబ్ సిరీస్ లో నటించనుంది..? ఎవరా డైరెక్టర్..? లాంటి డీటేల్స్ అప్పుడే రివీల్ చేయలేదు కానీ హన్సిక కూడా ఆల్రెడీ ఓ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వీలతో పాటు కైరా అద్వానీ ఇప్పటికే సక్సెస్ ఫుల్ డెబ్యూ అనిపించుకుంది. సంజన కూడా ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ సెట్స్ పై ఉన్నట్టు తెలుస్తుంది.