‘హారర్ స్టార్’... అల్లు అర్జున్ నాకిచ్చిన బిరుదు

Wednesday,December 04,2019 - 09:03 by Z_CLU

శ్రీనివాస్ రెడ్డి జస్ట్ కమెడియన్ మాత్రమే కాదు. హీరో కూడా. అయితే అంతటితో ఆగాడా…? ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమాతో ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగా కూడా మారాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, బన్ని తనకు ‘హారర్ స్టార్’ అనే బిరుదు సూటవుతుందని చెప్పాడని చెప్పుకున్నాడు.

‘గీతాంజలి’ సక్సెస్ తర్వాత కొన్నాళ్ళకు ‘ఆనందో బ్రహ్మ’ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేశాడు శ్రీనివాస్ రెడ్డి. అయితే ఈ సినిమా తరవాత వరసగా హారర్ సినిమాల ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ విషయం తెలిసి బన్ని.. ‘నువ్విలా వరసగా హారర్ సినిమాలు చేస్తూ పోతే… నువ్వు హారర్ స్టార్ అయిపోతావు’ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు’ అని చెప్పుకున్నాడు.

హారర్ జోనర్ లో కొత్తగా అనిపించి చేసేయాలని అనిపించే స్థాయిలో కథలు రాలేదు కాబట్టే ఆ జోనర్ ని పక్కన పెట్టాను అని చెప్పుకున్న శ్రీనివాస్ రెడ్డి… ‘భాగ్యనగర వీధుల్లో..’ సక్సెస్ అయితే దర్శకుడిగా మరిన్ని సినిమాలు చేస్తానని చెప్పుకున్నాడు.