అందరికీ చెప్పి పెళ్లి చేసుకుంటా

Friday,April 17,2020 - 02:45 by Z_CLU

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా ఇళ్లకే పరిమితమైపోయారు. అయినప్పటికీ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది ఆపిల్ బ్యూటీ హన్సిక. తాజాగా తన అభిమానులతో యూట్యూబ్ లైవ్ లో మాట్లాడిన హన్సిక.. తన పెళ్లి, శింబు, వెబ్ సిరీస్ పై స్పందించింది

“ఇంకా శింబు గురించి అడుగుతున్నారు. పర్సనల్ విషయాలు మాట్లాడ్డం ఇష్టం ఉండదు. కానీ ఇంకోసారి చెబుతున్నాను. శింబు నాకు మంచి ఫ్రెండ్. ఒకప్పుడు అతడు నా గతం. కానీ ఇప్పుడు ఇద్దరం మంచి స్నేహితులం. ఎక్స్-లవర్స్ స్నేహితులుగా మారొచ్చు కదా.”

“ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే అప్పుడు కచ్చితంగా నా యూట్యూబ్ ఛానెల్ లో చెప్పి మరీ చేసుకుంటాను.”

ఇలా శింబు గురించి మనసులో మాట బయటపెట్టింది హన్సిక. ప్రస్తుతం తెలుగులో నషా అనే వెబ్ సిరీస్ చేస్తున్న ఈ హీరోయిన్.. ఇకపై సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తానని స్పష్టంచేసింది.