దేవుడా... ఓ మంచి దేవుడా.. వెంకీ కామెడీ

Wednesday,December 04,2019 - 12:57 by Z_CLU

వెంకీ మామ రిలీజ్ డేట్ పై ఈ మధ్యంతా చాలా గందరగోళం నడిచిన సంగతి తెలిసిందే. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేకపోయారు. చివరకు డిసెంబర్ 13ను ఫిక్స్ చేశారు. ఈ మొత్తం ప్రహసనాన్ని కామెడీగా చెప్పుకొచ్చాడు వెంకటేశ్. తను కూడా రిలీజ్ కోసం చాలా ఎదురుచూసినట్టు, ఫైనల్ గా ఆరోజు రానే వచ్చిందంటూ కామెడీగా మాట్లాడాడు.

“దేవుడా.. ఓ మంచి దేవుడా.. చాలా థ్యాంక్స్ దేవుడా.. ఫైనల్ గా డిసెంబర్ 13న సినిమా వస్తోంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను దేవుడా.. ఎప్పుడూ ఇంత టెన్షన్ లేదు. వెంకీ మామ అన్నారు.. మిలట్రీ నాయుడు అన్నారు… రిలీజ్ కు మాత్రం చాలా రోజులు తీసుకున్నారు. థ్యాంక్యూ సురేష్ ప్రొడక్షన్స్, థ్యాంక్యూ అన్నయ్య.”

ఇలా కాస్త ఫన్నీగా మాట్లాడి ఏకంగా సురేష్ బాబుపైనే సెటైర్ వేశారు వెంకటేశ్. ఈ ఒక్క డైలాగ్ తో తన ఫ్యాన్స్ అందర్నీ శాటిస్ ఫై చేశాడు. వెంకీ స్పీచ్ తో ఇన్నాళ్లూ ఈ సినిమాపై కోపంతో ఉన్న దగ్గుబాటి ఫ్యాన్స్ అంతా ఖుషీ అయిపోయారు.

సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయంటున్నాడు వెంకీ. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ హార్ట్ టచింగ్ గా ఉంటుందని, తన కంటే నాగచైతన్య చాలా బాగా చేశాడని చెప్పుకొచ్చారు.