ట్రెండ్స్ సెట్ చేయడం మానని సమాంత

Tuesday,November 12,2019 - 09:03 by Z_CLU

కరియర్ కాస్త వెనకబడింది అనిపిస్తేనో… ఇంకా ఇప్పట్లో అవకాశాలు దొరికే సూచనలు కూడా కనిపించట్లేదు అనిపించినప్పుడో.. మెల్లిగా డిజిటల్ ప్లాట్ ఫామ్ గురించి ఆలోచిస్తారు హీరోయిన్స్. కానీ సమాంత వేరు… గత కొన్నేళ్లుగా టాప్ హీరోయిన్ గా ఫిక్సయిన సమంతా స్థానం చిన్నగా కూడా చెక్కు చెదరలేదు. అయినా వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేనా..? టెర్రరిస్ట్ గా కరియర్ లోనే ఫస్ట్ టైమ్ డిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. స్యామ్ కరియర్ లో ఇలా సెట్ చేసిన ట్రెండ్స్ ఎన్నో…

డీ గ్లామర్ లుక్స్– గ్లామరస్ హీరోయిన్ అనిపించుకున్న తరవాత డీ గ్లామర్ లుక్స్ లో కనిపించాలంటే ఏ హీరోయిన్ అయినా జంకుతుంది. కానీ సమంతా అలాంటి అవకాశం వస్తే మరింత చాలెంజింగ్ గా తీసుకుంది. ‘రంగస్థలం’ లో రామలక్ష్మి క్యారెక్టర్ లో నటించి మరింత మందిని ఇన్స్ పైర్ చేసింది.

 

బౌండరీ దాటింది –   మంచి కథల కోసం చూస్తుంటారు హీరోయిన్స్. అవకాశం దొరకాలే కానీ డిఫెరెంట్ రోల్స్ లో కనిపించి ఎంటర్టైన్ చేయాలనుకుంటారు. కానీ సమంతా అనుకుంటూ కూర్చోలేదు… డిఫెరెంట్ లాంగ్వేజెస్ లో సక్సెస్ అయిన సినిమాలని, ‘ఓ బేబీ’ లాంటి కొరియన్ సినిమాలని కూడా రీమేక్ చేసి ఇండస్ట్రీలో కథల స్థాయిని మరింత వైడ్ చేసింది.

క్యారెక్టర్ రోల్స్ : సాధారణంగా ఓ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంటే, ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అంటూ బేరీజులు వేస్తారు. అందుకే సాధారణంగా ఓ హీరోయిన్ సినిమాలో నటించడానికి మ్యాగ్జిమం ఇంట్రెస్ట్ చూపించరు హీరోయిన్స్. కానీ సమంతా డిఫెరెంట్ గా ఆలోచించింది. ‘మహానటి’ సినిమాలో క్యారెక్టర్ రోల్ ప్లే చేసినా తన ఇంపాక్ట్ ఉండేలా చూసుకుంది.

హీరోయిన్ గా స్థాయి పెరుగుతున్న కొద్దీ ఇండస్ట్రీకి మరిన్ని స్టాండర్డ్స్ ని పరిచయం చేస్తున్న సమంతా… ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తూనే ఉంది.