లేటైనా లేటెస్ట్ గా.....

Thursday,April 06,2017 - 10:00 by Z_CLU

టాలీవుడ్ స్టార్ హీరోల్లో కొందరు కాస్త లేటైనా లేటెస్ట్ గా ఎంటర్టైన్ చేయాలని డిసైడ్ అయ్యారు. రొటీన్ కథలు, రొటీన్ క్యారెక్టర్స్ పక్కన పెట్టి డిఫరెంట్ స్టోరీస్, పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ కొత్త రూట్ లో వెళ్తున్నారు. అలా కాస్త లేట్ అయిన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న ఆ స్టార్ హీరోలపై ఓ లుక్కేద్దాం…

 

లేట్ అయినా లేటెస్ట్ రాబోతున్న హీరోల్లో ముందున్నాడు రవితేజ. బెంగాల్ టైగర్ సినిమా తరువాత ఆల్మోస్ట్ సంవత్సరం పైనే గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ ఈ గ్యాప్ లో రెండు సినిమాలు ప్లాన్ చేశాడు. రెండూ డిఫరెంట్ మూవీసే. ప్రస్తుతం ‘రాజా ది గ్రేట్’ సినిమాలో అంధుడిగా నటిస్తున్న రవితేజ… మరోవైపు ‘టచ్ చేసి చూడు’ సినిమాలో కూడాా కొొత్తగా ట్రై చేేస్తున్నాడు.

జనతా గ్యారేజ్ తరువాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ కథ తో మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దాదాపు చాలా నెలల టైం తీసుకున్న తారక్ ఈ సినిమాతో తనలోని సరి కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నాడు.

ఈ వెయిటింగ్ లిస్ట్ లో అక్కినేని అఖిల్ కూడా ఉన్నాడు. రెండో సినిమాకు దాదాపు 2 సంవత్సరాల పాటు టైం తీసుకున్న అఖిల్ ఎట్టకేలకి ఓ డిఫరెంట్ స్టోరీ తో విక్రమ్ కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.


నెక్స్ట్ సినిమా కోసం కాస్త టైం తీసుకొని వెయిట్ చేసిన లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు. ‘ధృవ’ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా ప్లాన్ చేసిన చెర్రీ… ఈ సినిమా కోసం చాలా హోమ్ వర్క్ చేశాడు. సరికొత్త లుక్ తో ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నాడు.


‘హైపర్’ సినిమా తర్వాత డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేయాలనీ డిసైడ్ అయిన రామ్.. తన నెక్స్ట్ సినిమాలో కొత్త లుక్ కోసం చాలా టైం తీసుకున్నాడు. గ్యాప్ తీసుకున్న టైంలో దాదాపు 80 శాతం లుక్ కోసమే కష్టపడ్డ ఈ ఎనర్జిటిక్ స్టార్ ఎట్టకేలకి నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేశాడు.