జీ సినిమాలు ( ఏప్రిల్ 6th)

Wednesday,April 05,2017 - 10:07 by Z_CLU

నటీ నటులు : శ్రీకాంత్, మోనికా బేడి, సంఘవి

ఇతర నటీనటులు : శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాస రావు, నూతన్ ప్రసాద్, సుధ, బ్రహ్మానందం

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : ముప్పలనేని శివ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 25 మే 1995

శ్రీకాంత్ హీరోగా ముప్పలనేని శివ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ తాజ్ మహల్. శ్రీకాంత్ ని లవర్ బాయ్ గా సిల్వర్ స్క్రీన్ పై లవర్ బాయ్ గా ఎస్టాబ్లిష్ చేసిన  సినిమా ఇది. శ్రీకాంత్ సరసన మోనికా బేడీ, సంఘవి నటించారు. M.M. శ్రీలేఖ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్.

============================================================================

నటీనటులు : ప్రభాస్, అసిన్, ఛార్మి కౌర్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, రాజ్యలక్ష్మి, రాధా కుమారి, నారాయణ రావు, కల్పన, పద్మనాభం తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : వెంకట రాజు, శివ రాజు

రిలీజ్ డేట్ : 25 మార్చి 2005

ప్రభాస్ హీరోగా నటించిన ‘చక్రం’ అటు ప్రభాస్ కరియర్ లోను ఇటు డైరెక్టర్ కృష్ణవంశీ కరియర్ లోను చాల స్పెషల్ మూవీస్. ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆసిన్, ఛార్మి లు హీరోయిన్ లుగా నటించారు. లైఫ్ ఉన్నంత కాలం నవ్వుతూ బ్రతకాలనే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చక్రం. చక్రి అందించిన సంగీతం సినిమాకే హైలెట్.

=============================================================================

నటీనటులు  – తరుణ్ ,జెనీలియా

ఇతర నటీనటులు – పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, రఘు బాబు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్       –  మణిశర్మ, విద్య సాగర్

డైరెక్టర్   –  కృష్ణ వంశీ

విడుదల తేదీ – 2009

 వరుస ప్రేమ కథా చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకొని లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘శశిరేఖ పరిణయం’. జెనీలియా శశి రేఖ గా నటించిన ఈ చిత్రం  2009 లో విడుదలైంది. ఈ చిత్రం తో తొలి సారిగా జత కట్టారు తరుణ్-జెనీలియా. కాబోయే భార్య భర్తల మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా అలరించింది. ఈ చిత్రం లో పెళ్లంటే భయపడే అమ్మాయి పాత్రలో  జెనీలియా నటన, ఒక అమ్మాయి గురించి తన జీవితం గురించి ఆలోచించే యువకుడి పాత్రలో తరుణ్ అందరినీ ఆకట్టుకున్నారు. తన ప్రతి సినిమాలో కుటుంబ విలువలను చాటి చెప్పే క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని కూడా అదే కోవలో ఫ్యామిలీ అంశాలతో కూడిన లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించి అలరించారు.

=============================================================================

నటీ నటులు : కృష్ణుడు, శరణ్య మోహన్, వీరేంద్ర నాథ్ యండమూరి, రావు రమేష్

మ్యూజిక్ డైరెక్టర్ : మణికాంత్ కద్రి

డైరెక్టర్ : సాయి కిరణ్ అడివి

ప్రొడ్యూసర్ : మహి V రాఘవ్

రిలీజ్ డేట్ : 5 నవంబర్ 2009

కృష్ణుడు హీరోగా నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ ‘విలేజ్ లో వినాయకుడు’. శరణ్య మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అటు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం లో కూడా సక్సెస్ అయింది. ఈ సినిమాకి సాయి కిరణ్ అడివి దర్శకుడు.

========================================================================

నటీనటులు : విశాల్,లక్ష్మి మీనన్

ఇతర నటీ నటులు : ఇనియా ,శరణ్య పొన్ వణ్ణం, సుందర్ రాము, జయ ప్రకాష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జి.వి.ప్రకాష్ కుమార్

ప్రొడ్యూసర్  : విశాల్. రోన్ని,సిద్దార్థ్

డైరెక్టర్  : తిరు

విశాల్- లక్ష్మి మీనన్ జంటగా దర్శకుడు తిరు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇంద్రుడు’. ఈ సినిమాలో ఓ డిసార్డర్ తో భాధ పడే ఓ  యువకుడిగా నటించాడు విశాల్. విశాల్ యాక్టింగ్ , లక్ష్మి మీనన్ గ్లామర్, కామెడీ సీన్స్ , యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ లో ట్విస్ట్ ఈ సినిమాకు హైలైట్స్….

==============================================================================

నటీనటులు – సాయికుమార్, సన

ఇతర నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, శోభరాజ్, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్  – ఆర్పీ పట్నాయక్

డైరెక్టర్  – థ్రిల్లర్ ముంజు

విడుదల తేదీ – 1996

అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2ను తెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా ఈ సీక్వెల్ కు కూడా పనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర ఈ సినిమాలోనిదే. యాక్షన్ సినిమాలు, అదిరిపోయే మాస్ డైలాగులు కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది.

============================================================================

నటీనటులు – హరీష్, ఏవీఎస్, బ్రహ్మానందం

సంగీత దర్శకుడు – కోటి

దర్శకుడు – ఏవీఎస్

విడుదల తేదీ – 1997

హాస్యనటులంతా హీరోలుగా  మారితే ఎలా ఉంటుందనే చిలిపి ఆలోచన నుంచి పుట్టిన కథే సూపర్ హీరోస్.  సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలో ఏవీఎస్,  బ్రహ్మానందం లీడ్ క్యారెక్టర్స్ పోషించారు. అనుకోని వరం పొందిన ఏవీఎస్, బ్రహ్మానందం…  హరీష్ ప్రేమను ఎలా గెలిపించారు…  తమ తల్లిని ఎలా చేరుకున్నారు అనేదే ఈ సినిమా స్టోరీ. అత్యధిక సంఖ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్న సినిమాగా అప్పట్లో…  సూపర్ హీరోస్ పేరుతెచ్చుకుంది. కథ మొత్తం ఎవీఎస్, బ్రహ్మానందం చుట్టూనే తిరిగినప్పటికీ.. సెంటిమెంట్, కామెడీకి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు.