యంగ్ హీరోలతో స్టార్ దర్శకులు....

Wednesday,November 02,2016 - 11:30 by Z_CLU

టాలీవుడ్ టాప్ దర్శకుల కన్ను ఇప్పుడు యంగ్ హీరోలపై పడింది. మొన్నటి వరకూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ చోటు సంపాదించుకొని బడా విజయాలు అందుకున్న దర్శకులు ప్రస్తుతం స్టార్ హీరోల చుట్టూ తిరుగుతూ డేట్స్ కోసం ఎదురుచూడటం మానేసి తమకు అందుబాటులో ఉన్న యంగ్ హీరోలతో సినిమాలకు రెడీ అయిపోతున్నారు. ఈ లిస్ట్ లో ముందున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ‘ఇద్దరమ్మాయిలతో ‘ తరువాత నితిన్ తో ‘హార్ట్ ఎటాక్ ‘ సినిమా చేసిన పూరి…. ఆ తరువాత మరో యంగ్ హీరో వరుణ్ తేజ్ తో ‘లోఫర్’ చేశాడు. ప్రస్తుతం ఇషాన్ అనే మరో యంగ్ హీరో ను ‘రోగ్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు.

collage2

ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో తో సినిమా చేసి ఈ లిస్ట్ లో చేరిపోయాడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరువాత నితిన్ హీరో గా ‘అ ఆ’ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాతో నితిన్ ను 50 కోట్ల క్లబ్ లో కూడా చేర్చి దర్శకుడిగా తన సత్తా చాటాడు. త్వరలోనే తనే నిర్మాతగా మారి మరో యంగ్ స్టర్ తో సినిమా చేయబోతున్నాడట.

వరుసగా బడా హీరోలతో సినిమాలు చేస్తూ బడా హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల ‘ఆగడు’ తో స్టార్ హీరోలకు బాయ్ చెప్పేసి ప్రస్తుతం మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ సినిమా చేస్తున్నాడు. బోయపాటి సైతం ప్రస్తుతం యంగ్ హీరో కే ఓటేశాడు. హీరో బెల్లం కొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు.