అఖిల్ నిశ్చితార్థం డేట్ ఫిక్స్...

Wednesday,November 02,2016 - 07:27 by Z_CLU

సిసింద్రీ అక్కినేని, శ్రియ భూపాల్ ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసిందే. వాళ్ల ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్న విషయం కూడా పాతదే. కొత్త మేటర్ ఏంటంటే.. వీళ్ల ప్రేమ.. పెళ్లిగా మారడానికి ఓ అడుగు ముందుకు పడింది. అఖిల్-శ్రియభూపాల్ నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ అయింది. వచ్చేనెల 9, శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అఖిల్-శ్రియ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నిశ్చితార్థానికి పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించబోతున్నారు.

నాగచైతన్య-సమంత ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వాళ్ల  ప్రేమ వ్యవహారం బయటపడిన కొన్ని రోజులకే.. అఖిల్ లవ్ మేటర్ కూడా బయటకొచ్చింది. ఇద్దరు అక్కినేని బ్రదర్స్.. తమ లవ్ ఎఫైర్స్ తో వార్తల్లో హెడ్ లైన్స్ అయిపోయారు. అయితే.. తనకంటే ముందే తమ్ముడి పెళ్లి ఉంటుందని ఈమధ్య నాగచైతన్య ప్రకటించాడు. చెప్పినట్టుగానే చైతూ కంటే ముందే అఖిల్ పెళ్లి కొడుకుగా ముస్తాబవుతున్నాడు. వచ్చే ఏడాది అఖిల్-శ్రియల పెళ్లి ఉంటుంది. తాజా సమచారం ప్రకారం.. అఖిల్ పెళ్లిని విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట.

akhil11478009497