వరుసగా మూడో సినిమా ఫిక్స్ చేసిన మహేష్...

Wednesday,November 02,2016 - 11:45 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వం లో నటిస్తున్న మహేష్ ఈ సినిమా షూటింగ్ ను జనవరి నాటికి పూర్తిచేసి దర్శకుడు కొరటాల శివతో సినిమాను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా తరువాత మహేష్ తో సినిమా చేసేందుకు ముగ్గురు దర్శకులు రెడీ గా ఉన్నప్పటికీ మహేష్ మాత్రం వంశీ పైడిపల్లి కే ఓటేశాడు.

ఇప్పటికే మహేష్ తో మూడో సినిమా చేయాలని పూరి, త్రివిక్రమ్ చూస్తుండగా మహేష్ మాత్రం వంశీ పైడిపల్లి సినిమా తరువాతే మిగతా ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించాలని డిసైడ్ అయ్యాడట. తాజాగా మహేష్ తో బ్రహ్మోత్సవం సినిమాను నిర్మించిన పి.వి.పి బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో ప్రారంభం అవుతుంది. ఈ విషయాన్ని నిర్మాత పీవీపీ స్వయంగా ప్రకటించాడు. సో.. మరో రెండేళ్ల పాటు మహేష్ ఫుల్ బిజీగా ఉండబోతున్నాడన్నమాట.