'మిస్టర్' తో శ్రీనువైట్ల రె 'ఢీ'

Saturday,December 31,2016 - 08:30 by Z_CLU

మొన్నటి వరకూ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల వరుణ్ తేజ్  ను ‘మిస్టర్’ గా చూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. వరుణ్ తేజ్  సరసన లావణ్య త్రిపాఠి-హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

న్యూ ఇయర్ సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ ను కూడా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు యూనిట్. క్యూట్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ప్రెజెంట్ సోషల్ మీడియా లో హంగామా చేస్తుంది. కెరీర్ స్టార్టింగ్ లో ‘నీకోసం’ ‘ఆనంద్’,’వెంకీ’ వంటి లవ్ ఎంటర్టైనర్స్ తో హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల మరో సారి అలాంటి క్యూట్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ‘మిస్టర్’ తో సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి మొన్నటి వరకూ బడా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన శ్రీను వైట్ల ఇప్పుడు ‘మిస్టర్’ తో బాక్సాఫీస్ ను ఢీ కొట్టబోతున్నాడు. మరి ఈ స్టార్ డైరెక్టర్ ఈ క్యూట్ లవ్ ఎంటర్టైనర్ తో ఎలాంటి హిట్ అందుకుంటాడో? చూడాలి..