టీజర్ తో రెడీ...

Saturday,December 31,2016 - 07:20 by Z_CLU

పవర్ స్టార్ తన లేటెస్ట్ సినిమా ‘కాటమరాయుడు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో అందరికి కంటే ముందే అభిమానులను విష్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మరో సారి టీజర్ తో మెగా ఫాన్స్ లో జోష్ నింపడానికి రెడీ అవుతున్నాడు పవన్.

 ఇక ఇప్పటికే న్యూ ఇయర్ పోస్టర్, మోషన్ పోస్టర్ తో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న పవన్ మరో సారి ఈ సినిమాకు సంబంధించిన షార్ట్ టీజర్ తో విష్ చేసి న్యూ ఇయర్ లో జోష్ నింపబోతున్నాడు. డిసెంబర్ 31 నైట్ ఈ షార్ట్ టీజర్ ను రిలీజ్ చేసి సంక్రాంతి కి మరో టీజర్ ను రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నారట మేకర్స్. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ షార్ట్ టీజర్ కోసం ఇప్పటికే మెగా ఫాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎదురుచూపులు మొదలయ్యాయి.