జీ సినిమాలు ( జనవరి 1st )

Saturday,December 31,2016 - 10:14 by Z_CLU

nenu-meeku-telusa

నటీ నటులు : మంచు మనోజ్ స్నేహ ఉల్లాల్

ఇతర నటీనటులు : రియా సేన్, నాజర్, సునీల్, ఉత్తేజ్, బ్రహ్మానందం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అచ్చు & ధరన్

డైరెక్టర్ : అజయ్ శాస్త్రి

ప్రొడ్యూసర్ : లక్ష్మి మంచు

రిలీజ్ డేట్ : 2008

మంచు మనోజ్, స్నేహ ఉల్లాల్ జంటగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘నేను మీకు తెలుసా..?’ ఒక ఆక్సిడెంట్ లో తండ్రిని కోల్పోయిన ఆదిత్య తన బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం షార్ట్ టైం మెమొరీ పేషెంట్ లా మారతాడు. తన రెగ్యులర్ ఆక్టివిటీస్ మర్చిపోకుండా ఉండటం కోసం, ఒక ఆడియో క్యాసెట్ లో ఎప్పటికపుడు రికార్డు చేసుకునే ఆదిత్య లైఫ్ ఎలాంటి మలుపులు తిరుగుతుంది. అసలు తనకు జరిగింది ఆక్సిడెంటా..? లేక హత్యా ప్రయత్నమా..? అనే అంశాలతో ముడిపడిందే ఈ సినిమా. షార్ట్ టైం మెమొరీ పేషెంట్ గా మనోజ్ నటన ఈ సినిమాలో హైలెట్.

==============================================================================

victory

హీరోహీరోయిన్లు  – నితిన్, మమతా మోహన్ దాస్

నటీనటులు – సింధు తులాని, అశుతోష్ రానా, శశాంక్, దువ్వాసి మోహన్, బ్రహ్మానందం,అలీ

సంగీతం – చక్రి

బ్యానర్ – ఆర్.ఆర్. మూవీ మేకర్స్

దర్శకత్వం – రవి. సి. కుమార్

విడుదల – 2008, జూన్ 27

ల్యాండ్ మాఫియా నేపథ్యంలో నితిన్ నటించిన సినిమా విక్టరీ. 2008లో నితిన్ మూడు సినిమాలు చేస్తే అందులో ఒకటి విక్టరీ. అశుతోష్ రానా విలన్ గా నటించిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ ఎప్పీయరెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ తెలివైన కుర్రాడు తన బలంతో పాటు తెలివితేటలతో ల్యాండ్ మాఫియాను ఎలా అడ్డుకున్నాడనేదే ఈ సినిమా స్టోరీ.

============================================================================

rakshanaనటీ నటులు : అక్కినేని నాగార్జున, శోభన

ఇతర నటీనటులు : రోజా, నాజర్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : ఉప్పలపాటి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 18 ఫిబ్రవరి 1993

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కరియర్ లో బెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ రక్షణ. ఈ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో విలన్ గా నటించిన కోట శ్రీనివాస్ రావు పర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్. ఉప్పలపాటి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.

=============================================================================

english-vinglish

నటీనటులు – శ్రీదేవి, ప్రియా ఆనంద్, మెహ్దీ నెబూ, ఆదిల్ హుస్సేన్

సంగీతం – అమిత్ త్రివేది

దర్శకత్వం – గౌరీ షిండే

విడుదల తేదీ – 2012, సెప్టెంబర్ 14

అతిలోకసుందరి శ్రీదేవి  గ్రాండ్ గా  రీఎంట్రీ ఇచ్చిన మూవీ ఇంగ్లిష్ వింగ్లిష్.  అప్పట్లో శ్రీదేవికి ఎంత పేరు ఉండేదో, తిరిగి అంత క్రేజ్ ను ఓవర్ నైట్ లో ఆమెకు తీసుకొచ్చింది ఈ సినిమా. తనలో నటనా పటిమ ఏమాత్రం తగ్గలేదని శ్రీదేవి నిరూపించుకున్న సినిమా ఇది. ఒక సాధారణ గృహిణి విదేశాలకు వెళ్లినప్పుడు, ఇంగ్లిష్ తెలియక ఎలా ఇబ్బందిపడింది.. దాన్నుంచి సక్సెస్ ఫుల్ గా ఎలా బయటపడి.. ఓ స్వతంత్ర మహిళగా ఎదిగిందనేదే ఈ స్టోరీ. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో శ్రీదేవి యాక్టింగ్ టాలెంట్ మనకు కనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్, అజిత్ గెస్ట్ రోల్స్ పోషించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా హిట్ అయింది.

==============================================================================

palanadu-movie

నటీనటులు : విశాల్, భారతీ రాజా

ఇతర నటీనటులు : లక్ష్మీ మీనన్, సూరి, విక్రాంత్, శరత్ లోహితశ్వ, హరీష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : సుసీంతిరన్

ప్రొడ్యూసర్ : విశాల్

రిలీజ్ డేట్ : 2 నవంబర్ 2013

విశాల్, విక్రాంత్, లక్ష్మీ మీనన్ నటించిన డ్రామా థ్రిల్లర్ పలనాడు. ఇమ్మన్ సంగీతం అందించిన ఈ సినిమాకి సుసీంతిరన్ దర్శకత్వం వహించాడు.

===============================================

happy-new-year

నటీనటులు : షారుక్ ఖాన్, దీపికా పాడుకొన్

ఇతర నటీనటులు : అభిషేక్ బచ్చన్, సోను సూద్, బొమన్ ఇరానీ, తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ శేఖర్

డైరెక్టర్ : ఫరాఖాన్

ప్రొడ్యూసర్ : గౌరీ ఖాన్

రిలీజ్ డేట్ : 24 అక్టోబర్ 2014

షారుక్ ఖాన్, దీపికా పాడుకొన్ నటించిన హిందీ బ్లాక్ బస్టర్ హ్యాప్పీ న్యూ ఇయర్. ఫరాఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి విశాల్ శేఖర్ సంగీతం అందించాడు.

==============================================================================

 

shiva

నటీ నటులు : నాగార్జున, అమల

ఇతర నటీనటులు : రఘువరన్, J.D.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, పరేష్ రావల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయ రాజా

డైరెక్టర్ : రామ్ గోపాల్ వర్మ

ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 1990రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘శివ’ దాదాపు అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రూపు రేఖల్ని మార్చేసింది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని ఒక రితీన్ ఫార్మూలాలో వెళుతున్న ట్రెండ్ ఒక పెద్ద కుదుపు లాంటిదీ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి 26 గడిచినా ఆ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సినిమాకి ఇళయ రాజా ఇచ్చిన సంగీతం ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది.