ఆదివారం సెలవు అస్సలు నచ్చదట

Thursday,September 14,2017 - 11:19 by Z_CLU

సండే వస్తే రిలాక్స్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ బన్నీ బ్యూటీకి మాత్రం ఆదివారం సెలవు అస్సలు నచ్చదంటోంది. అంతేకాదు, రోజుకు 28 గంటలుంటే బాగుంటుందని కూడా అంటోంది. రెస్ట్ తీసుకోవడం ఇష్టంలేదంటున్న పూజా హెగ్డే, ఆదివారం కూడా షూటింగ్ పెడితే అభ్యంతరం చెప్పనంటోంది.

బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ఈ భామ.. ప్రస్తుతం తన కెరీర్ ఊపందుకుందని, త్వరలోనే మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు ప్రకటిస్తానని తెలిపింది. తన మనసుకు నచ్చినట్టు జీవిస్తున్నానని తెలిపిన పూజా.. ఆదివారం కూడా రెస్ట్ తీసుకోవడం లేదని, ఒకవేళ గ్యాప్ దొరికితే తన ఫ్రెండ్స్ డిజైనర్ స్టోర్స్ కు వెళ్తుంటానని.. లేటెస్ట్ గాడ్జెట్స్, ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతుంటానని అంటోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా, శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది పూజా. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న మహేష్ బాబు-వంశీ పైడిపల్లి సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకుంటారనే టాక్ నడుస్తోంది.