భారీ షెడ్యూల్ పూర్తి చేసిన బెల్లంకొండ శ్రీనివాస్

Tuesday,September 12,2017 - 07:05 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరెక్షన్ లో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఇటీవలే ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.. పొల్లాచిలో 15 రోజుల జరిగిన ఈ షెడ్యూల్ లో పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేశారు యూనిట్. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ సారధ్యంలో విండ్ టర్బైన్స్ తో కలిపి భారీ సెట్ లో రూపొందిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలవనుంది సమాచారం.


బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శరత్ కుమార్,మీనా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు.