కోలీవుడ్ ఎంట్రీ కోసం మహేష్ స్పెషల్ ప్లాన్

Wednesday,August 16,2017 - 02:48 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ -మురుగదాస్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా తెరకెక్కుతున్న ‘స్పైడర్’ ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఏకకాలంలో రూపొందుతుండడం, ఈ సినిమాతో మహేష్ కోలీవుడ్ కి పరిచయం కాబోతుండడంతో ఈ సినిమాకు సంబంధించి కోలీవుడ్ లో భారీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సెప్టెంబర్ 9 న చెన్నైలో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్ ఆ ఈవెంట్ లో మహేష్ ను కోలీవుడ్ కు పరిచయం చేసే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టనున్నారు. ఈ ఈవెంట్ నుంచి మొదలుపెట్టి కోలీవుడ్ లో మరిన్ని  ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.