తొలిప్రేమ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ సినిమా

Wednesday,August 16,2017 - 12:10 by Z_CLU

టాలీవుడ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఎవర్ గ్రీన్ లవ్ ఎంటర్టైనర్ మూవీ తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను తారాస్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమాతో దర్శకుడిగా ఎనలేని క్రేజ్ అందుకున్నాడు కరుణాకరన్. ఇప్పుడు ఆ ‘తొలిప్రేమ’ డైరెక్టర్ తో సందడి చేయడానికి రెడీ అయ్యాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.

ఇటీవలే జవాన్ సినిమాను కంప్లీట్ చేసిన సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేసి సెట్స్ పై పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కరుణాకరన్ తో మరో సినిమాను ప్రారంభించాడు తేజు.

కరుణాకరన్ – సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సాయి ధరమ్ తేజ్10వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాను క్రియేటీవ్ కమర్షియల్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు సమర్పణలో వల్లభ నిర్మించనున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇప్పటికే 2 ట్యూన్స్ కూడా ఇచ్చాడు. డార్లింగ్ స్వామి డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా నుంచి ఉంటుంది.