Prabhas ఐదేళ్ళు బిజీ

Wednesday,December 09,2020 - 12:35 by Z_CLU

బాహుబలి ప్రాంచైజీ కోసం ఐదేళ్ళు కేటాయించి ఫ్యాన్స్ కి దూరంగా ఉన్న Prabhas మళ్ళీ ఓ ఐదేళ్ళు బిజీ అవ్వబోతున్నాడు. అయితే ఈసారి అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ఐదేళ్ళు కేటాయించబోతున్నాడు. అవును ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి.   ‘Radheshyam’ సినిమాను ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చిన ప్రభాస్ నాగ్ అశ్విన్ తో Prabhas21 , బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో Adipurush, ప్రశాంత్ నీల్ తో Salaar  వరుసగా మూడు సినిమాలు కమిట్ అయ్యాడు. వీటిలో  ఏ సినిమా ముందు సెట్స్ పైకి వెళ్లనుందనేది పక్కన పెడితే ప్రెజెంట్ ఓ ఐదేళ్ళ పాటు మాత్రం ప్రభాస్ డైరీ నిండిపోయినట్టే.

చేయబోయే మూడు సినిమాలు భారీ ప్రాజెక్టులే, పైగా పాన్ ఇండియా సినిమాలు. ఎంత లేదన్నా ఒక్కో సినిమాకు ఏడాది పడుతుంది. నాగ్ అశ్విన్ , ఓం రౌత్ సినిమాలకు సంవత్సరం పైనే పట్టొచ్చు. మరి ఇలా కొన్నేళ్ళ పాటు తన డేట్స్ ను బ్లాక్ చేసుకొని ఫ్యాన్స్ ను వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో మెస్మరైజ్ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. ఈ ప్రాజెక్ట్స్ అయ్యాకే రాజమౌళి, కొరటాల శివ లతో సినిమాలు చేసే అవకాశం ఉంది. ఏదేమైనా డార్లింగ్ ప్లానింగ్ సూపర్ అంటూ మురిసిపోతున్నారు రెబెల్ ఫ్యాన్స్.

Also Check SALAAR ఆ సినిమాకు రీమేక్ ?