Vasantha Kokila - మరో చిన్న ప్రయోగం
Saturday,November 07,2020 - 08:18 by Z_CLU
జాతియ అవార్డు గ్రహిత, విలక్షణ హీరో కమలహాసన్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన వసంత కోకిల ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో మరో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటిస్తున్నాడు. అప్పటి వసంత కోకిలలా ఇది కూడా ఓ చిన్నపాటి ప్రయోగమే.
SRT ఎంటర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రొడ్యూసర్ రామ్ తళ్లూరి, నూతన దర్శకుడు రమణన్ పురుషోత్తమ ను పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మిస్తున్నాడు.

శర్వానంద్ హీరోగా నటించిన నర్తనశాలతో హీరోయిన్ గా పరిచయమైన కాశ్మీర పర్ధేశీ.. ఈ వసంత కోకిలలో హీరోయిన్ గా నటిస్తోంది. మాంటిక్ థ్రిల్లర్ జానర్ గా ఈ సినిమా రెడీ అవుతుంది.