టాలీవుడ్ లో తమిళనటులు

Tuesday,November 12,2019 - 11:04 by Z_CLU

సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తూ హెవీ ఇంపాక్ట్ చేస్తున్నారు. వీళ్ళు తమిళ నటులే అయినా తమ పర్ఫార్మెన్స్ తో తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరవుతున్నారు. కొత్తలో సినిమా బైలింగ్వల్ అయితేనే వీళ్ళని ప్రిఫర్ చేసిన మేకర్స్, ఇప్పుడు స్ట్రేట్ రోల్స్ కి కూడా వీళ్ళనే ఎంచుకుంటున్నారు. అంత ఈజీగా తెలుగు నేటివిటీని అడాప్ట్ చేసుకుంటున్నారు ఈ తమిళ నటులు. 

సత్యరాజ్ –  ఇప్పుడు ప్రతి రోజు పండగలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ ని గమనిస్తే సినిమాలో హీరోకి ఎంత స్పేస్ ఉంటుందో.. ఈ క్యారెక్టర్ కి అంతే స్కోప్ ఉందనిపిస్తుంది. అందునా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి… డెఫ్ఫినెట్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ లాంటి క్యారెక్టర్ అయి ఉంటుంది. గతంలో బాహుబలి, మిర్చి లాంటి మరెన్నో సినిమాల్లో నటించాడు సత్యరాజ్. ఎక్కడా తెలుగు వాడు కాడేమో అని కూడా అనిపించడు. అంతగా టాలీవుడ్ లో సింక్ అయిపోయాడు.

విజయ్ సేతుపతి – సైరా లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఇప్పుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే అద్భుతమైన పర్ఫార్మర్ అనిపించుకున్న విజయ్ సేతుపతి ఇంకొన్నాళ్ళ పాటు తెలుగు సినిమాల్లో బ్రేక్ లేకుండా కనిపిస్తూనే ఉంటాడనిపిస్తుంది.

సముద్రఖని –  రాజమౌళి ‘RRR’ లో నటిస్తున్నాడు. దీంతో పాటు గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న రవితేజ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

బాబీసింహ – ‘డిస్కోరాజా’ కోలీవుడ్ లో బిజీగా ఉన్న నటుడు. ఇప్పుడు రవితేజ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

వరలక్ష్మీ శరత్ కుమార్ :  సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ’ నెగెటివ్ రోల్ చేసింది. ఈ సినిమా రిలీజ్ కూడా ఆవ్వకముందే రవితేజ, గోపీచంద్ మాలినేని సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాస్త నిలబడగలిగాయంటే వరలక్ష్మీ ఫ్యూచర్ లో మరిన్ని సినిమాల్లో కనిపించే చాన్సెస్ ఉన్నాయి.