రవితేజ నెక్స్ట్ సినిమా... టైటిల్ లోగో పోస్ట్ పోన్

Sunday,November 11,2018 - 11:02 by Z_CLU

వచ్చే వారం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ లోగో పోస్టర్ ను నవంబర్ 13 న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ లోగో పోస్టర్ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు మేకర్స్.

నెక్స్ట్ వీక్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ రిలీజ్ కానున్న సందర్భంగా ఆ సినిమా రిలీజ్ తర్వాతే టైటిల్ లోగో ని రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసారు. త్వరలోనేటైటిల్ లోగో  రిలీజ్ కి సంబంధించి కొత్త డేట్ ని ప్రకటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ పైకి రానుంది. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.