Vasantha Kokila Teaser - వెరీ ఇంట్రెస్టింగ్

Saturday,June 26,2021 - 12:46 by Z_CLU

SRT ఎంట‌ర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, త‌మిళ, క‌న్న‌డ భాష‌ల్లో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా హీరోగా రూపొందిన‌‌ ట్రైలింగ్వ‌ల్ మూవీ వ‌సంత కోకిల‌. ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌ధ్యంలో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ పురుషోత్త‌మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా కాశ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా న‌టిస్తోంది.

తాజాగా ఈ ట్రైలింగ్వ‌ల్ మూవీకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లై అన్ని వ‌ర్గాల అభిమానుల ఆద‌ర‌ణ అందుకుంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతంది. డైలాగ్స్ లేకుండానే కేవ‌లం విజువ‌ల్స్ తోనే ఆద్యంతం ఉత్కంఠ‌ని క‌లిగించే రీతిన టీజ‌ర్ ని రెడీ చేయ‌డం విశేషం.

రొమాంటిక్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ గా ఈ సినిమా రెడీ అవుతుంది. సినిమా జాన‌ర్ కి, బాబీ సింహా అత్యుత్త‌మ ప‌ర్ఫార్మెన్స్ కి త‌గిన విధంగానే ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ వ‌సంత కోకిలను తెర‌కెక్కించార‌ని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. జాతియ అవార్డు గ్ర‌హిత‌, విల‌క్ష‌ణ హీరో క‌మ‌లహాస‌న్, శ్రీదేవి కాంబినేష‌న్ లో వ‌చ్చిన వ‌సంత కోకిల ఏ రేంజ్ స‌క్సెస్ అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో తెర‌కెక్కుతున్న సినిమాలో మ‌రో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా న‌టించ‌డం విశేషం.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics