శివాని రాజశేఖర్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ

Tuesday,July 18,2017 - 07:23 by Z_CLU

జీవిత, రాజశేఖర్ ల కూతురు శివాని రేపోమాపో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతుంది. మెడిసిన్ తో పాటు డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ లో ట్రేనింగ్ తీసుకుంటున్న శివాని, రీసెంట్ గా ఓ ఫోటోషూట్ తో సినిమా ఫ్యాన్స్ నే కాదు, ఏకంగా ఫిలిం మేకర్స్ ని కూడా ఎట్రాక్ట్ చేసేసింది.

శివాని యాక్టింగ్ కరియర్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్న జీవిత, రాజశేఖర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ కంపెనీ ‘క్వాన్’ లో శివాని పేరు రిజిస్టర్ చేశారు. ఇప్పటి వరకు ‘క్వాన్’ సౌత్ ఇండియాలోనే కాదు, బాలీవుడ్ స్టార్స్ ని కూడా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేసింది.

ఇన్ సైడ్ సోర్సెస్ ప్రకారం ప్రస్తుతం ‘గరుడ వేగ’ తరవాత రాజశేఖర్, జీవిత కలిసి శివాని డెబ్యూ ఫిలిం విషయంలో  డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.