గ్రాండ్ గా లాంచ్ అయిన అడివి శేష్ ‘2 స్టేట్స్’

Saturday,March 24,2018 - 01:05 by Z_CLU

హిందీ సూపర్ హిట్ మూవీ ‘2 స్టేట్స్’ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతుంది ‘2 స్టేట్స్’ మూవీ. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతుంది.  ఈ సినిమా ఈ రోజు టాలీవుడ్ ప్రముఖుల మధ్య గ్రాండ్ గా ప్రారంభమైంది.

V.V. వినాయక్ గౌరవ ఆతిథ్యం వహించిన ఈ కార్యక్రమంలో  ఫాస్ట్ షాట్ ని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శక్వత్వం వహించగా, రెబల్ స్టార్ కృష్ణం రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. రాజమౌళి ఈ సినిమాకి క్లాప్ కొట్టడంతో ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది.

వెంకట్ రెడ్డి డైరెక్షన్ లో  లక్ష్య ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి MLV సత్యనారాయణ ప్రొడ్యూసర్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.