జీ సినిమాలు ( 19th July)

Tuesday,July 18,2017 - 10:35 by Z_CLU

ఓం శాంతి

నటీనటులు : నవదీప్, కాజల్ అగర్వాల్, నిఖిల్ సిద్ధార్థ, బిందు మాధవి, అదితి శర్మ

ఇతర నటీనటులు : R. మాధవన్, మురళి మోహన్, ప్రగతి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : ప్రకాష్ దంతులూరి

ప్రొడ్యూసర్ : శేషు ప్రియాంక చలసాని

రిలీజ్ డేట్ : 13 జనవరి 2010

నలుగురు యంగ్ స్టర్ మధ్య సాగే ఇంటరెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఓం శాంతి. ప్రకాష్ దంతులూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

 

 గణేష్

హీరోహీరోయిన్లు రామ్,కాజల్

ఇతర నటీనటులు పూనమ్ కౌర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం

సంగీతం      మిక్కీ జె మేయర్

దర్శకత్వం  –  శరవణన్

విడుదల తేదీ 2009

రామ్ కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గణేష్ జస్ట్ గణేష్‘. 2009 లో విడుదలైన ఈ సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్. చిన్న పిల్లలతో గణేష్ చేసే హంగామా , కాజల్-రామ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగా అలరిస్తాయి. అబ్బూరి రవి అందించిన మాటలు సినిమాకు ప్లస్, ముఖ్యంగా క్లైమాక్స్ లో మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కాజల్ కుటుంబ సభ్యుల మధ్య మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ హత్తుకుంటాయి.

==============================================================================

 

 

 లక్ష్మీ రావే మా ఇంటికి

 నటీనటులు : నాగశౌర్య, అవికా గోర్

ఇతర నటీనటులు : వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, కాశి విశ్వనాథ్, సప్తగిరి, సత్యం రాజేష్, నల్ల వేణు, ప్రగతి, పవిత్ర లోకేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రాధాకృష్ణ

డైరెక్టర్ : నంద్యాల రవి                                                                               

ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి

రిలీజ్ డేట్ : డిసెంబర్ 5, 2014

నాగశౌర్య, అవికా గోర్ జంటగా తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా కుటుంబ చిత్రం లక్ష్మీ రావే మా ఇంటికి. నంద్యాల రవి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్ల లోను సూపర్ హిట్ అయింది. రాధాకృష్ణ సంగీతం సినిమాకి హైలెట్. 

==============================================================================

 

 

  చంటి

హీరోహీరోయిన్లు రవితేజచార్మి

ఇతర నటీనటులు –  డైజీ బోపన్న, అతుల్ కులకర్ణి, రేవతి, రఘుబాబు, సుబ్బరాజు, వేణుమాధవ్

సంగీతం శ్రీ

దర్శకత్వం శోభన్

విడుదల తేదీ 2004, నవంబర్ 12

హీరో రవితేజ అప్పటికే పూర్తిస్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్, ఖడ్గం, ఇట్లు శ్రావణి  సుబ్రమణ్యం లాంటి హిట్స్ ఉన్నాయి. మరోవైపు శోభన్ వర్షం సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ చంటి. చార్మి హీరోయిన్  గా నటించిన ఈ సినిమాకు శ్రీ సంగీతం అందించాడు. దర్శకుడు  శోభన్ కు ఇదే ఆఖరి చిత్రం. ఈ సినిమా తర్వాత కన్నడంలో మరో సినిమా ఎనౌన్స్ చేసినప్పటికీ… అది సెట్స్ పైకి వెళ్లకముందే తీవ్రమైన గుండెపోటుతో శోభన్ చనిపోయారు. అదే ఏడాది శోభన్ సోదరుడు, ప్రముఖ కమెడియన్ లక్ష్మీపతి కూడా కన్నుమూయడం బాధాకరం.

==============================================================================

 

 

యాక్షన్ 3D

నటీ నటులు : అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్

ఇతర నటీనటులు : వైభవ్, రాజు సుందరం, శ్యామ్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : బప్పి& బప్పి లహరి, సన్నీ

డైరెక్టర్ : అనిల్ సుంకర

ప్రొడ్యూసర్ : రామబ్రహ్మం సుంకర

రిలీజ్ డేట్ : 21 జూన్ 2013

అల్లరి నరేష్ నటించిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యాక్షన్ 3D’. 2D, 3D ఫార్మాట్లలో తెరకెక్కిన మొట్టమొదటి కామెడీ చిత్రం. అల్లరి నరేష్ కరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకుడు.

=============================================================================

 

బాడీగార్డ్

నటీనటులు : వెంకటేష్, త్రిష, సలోని అశ్వని,

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయ ప్రకాష్ రెడ్డి, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : బెల్లం కొండ సురేష్

రిలీజ్ డేట్ : 14 జనవరి 2012

వెంకటేష్, త్రిష జంటగా నటించిన మోస్ట్ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ బాడీగార్డ్. గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ వెంకటేష్ పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

 

 

Mr. మేధావి

నటీ నటులు : జెనీలియా, రాజా, సోను సూద్, సుమన్

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : నీలకంఠ రెడ్డి

ప్రొడ్యూసర్ : రామారావు బొద్దులూరి, గోపీచంద్ లగడపాటి

రిలీజ్ డేట్ : 26 జనవరి 2008

రాజా, జెనీలియా నటించిన Mr. మేధావి పర్ ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. సోను సూద్ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించాడు. సెలవుల కోసం వచ్చిన శ్వేత, విశ్వాక్ పసితనంలోనే ప్రేమలో పడతారు. ఆ ప్రేమను విశ్వాక్ పెద్దయ్యాక కూడా కొనసాగిస్తాడు కానీ శ్వేత మరిచిపోతుంది. దానికి తోడు బిలియనీర్ అయిన సిద్ధార్థ్ తో పెళ్ళికి రెడీ అయిపోతుంది. అప్పుడు విశ్వాక్ తన ప్రేమను దకిన్చుకోవడానికి ఏం చేస్తాడు. ఎలా Mr. మేధావి అనిపించుకుంటాడు అన్నదే ప్రధాన కథాంశం.