గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ లో శర్వానంద్

Friday,November 03,2017 - 12:35 by Z_CLU

మహానుభావుడు సినిమా సక్సెస్ తరవాత నెవర్ సీన్ బిఫోర్ క్యారెక్టర్ లో ఎట్రాక్ట్ చేయబోతున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో గ్యాంగ్ స్టర్ లా కనిపించనున్నాడు శర్వానంద్. అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వానంద్ ని అవుట్ అండ్ అవుట్ మాస్ హీరోలా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో సుధీర్ వర్మ ఉన్నట్టు తెలుస్తుంది.

సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేద థామస్ తో పాటు షాలినీ పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తున్నా ఫిల్మ్ మేకర్స్ ఈ విషయాన్ని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇకపోతే ఈ సినిమాను మ్యాగ్జిమం డిసెంబర్ లోపే సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.