మరో సినిమా స్టార్ట్ చేసిన శర్వానంద్

Wednesday,August 28,2019 - 01:14 by Z_CLU

ఆల్రెడీ 96 రీమేక్ సెట్స్ పై ఉంది. ఈ నెల ప్రారంభంలో శ్రీకారం అంటూ మరో సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉంటుండగానే ముచ్చటగా మూడో సినిమా ప్రారంభించాడు శర్వానంద్. ఈసారి ఏకంగా తెలుగు-తమిళ భాషల్లో బై-లింగ్వల్ సినిమా చేయబోతున్నాడు ఈ హీరో.

డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మాత‌లుగా శ్రీకార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా ఈరోజు చెన్నైలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే ప్రారంభించారు. `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవ‌ర్మ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇదే ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.

జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌విలో సినిమాను విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శర్వానంద్ లిస్ట్ ప్రకారం చూసుకుంటే.. ముందుగా 96 రీమేక్, ఆ తర్వాత సంక్రాంతికి శ్రీకారం, ఆ తర్వాత సమ్మర్ కు ఈ కొత్త సినిమా రిలీజ్ అవుతాయన్నమాట.

న‌టీన‌టులు:
శ‌ర్వానంద్, రీతూవ‌ర్మ‌, నాజ‌ర్‌, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీకార్తీక్‌
నిర్మాత‌లు: ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు
బ్యాన‌ర్‌: డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌
డైలాగ్స్‌: త‌రుణ్ భాస్క‌ర్‌
మ్యూజిక్‌: జాక్స్ బిజోయ్‌
సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్‌
ఎడిట‌ర్: శ్రీజిత్ సారంగ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ఎన్‌.స‌తీశ్ కుమార్‌
కాస్ట్యూమ్స్ స్టైలిస్ట్ :ప‌ల్ల‌వి సింగ్‌