Sharwanand Oke Oka Jeevitham - కాన్సెప్ట్ బయటపెట్టిన మేకర్స్

Friday,July 16,2021 - 10:42 by Z_CLU

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ‌ర్వానంద్ కెరీర్‌లో రూపొందుతోన్న 30వ చిత్రం `ఒకే ఒక జీవితం`. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. ఇన్నాళ్లూ ఈ సినిమాను రొమాంటిక్ మూవీ లేదా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న మూవీ అనుకున్నారు. కానీ ఇదొక డిఫరెంట్ మూవీ.

ఒకే ఒక జీవితం సినిమా సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అంతేకాదు, ఇదొక మ్యూజికల్ బేస్డ్ మూవీ కూడా. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోతో ఈ విషయాన్ని బయటపెట్టారు మేకర్స్. సినిమాలో ఆది అనే కుర్రాడి పాత్రలో కనిపిస్తున్నాడు శర్వానంద్. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నాడు.

శ‌ర్వానంద్ స‌ర‌స‌న మ‌న తెలుగ‌మ్మాయి రీతు వ‌ర్మ‌హీరోయిన్ గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి స‌పోర్టింగ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం.

జేక్స్ బీజోయ్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా `డియ‌ర్ కామ్రెడ్` ఫేమ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎడిట‌ర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు.

ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో శ‌ర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సైన్స్ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యూత్‌కి న‌చ్చే విధంగా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics