"నెక్ట్స్ నువ్వే" సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్

Friday,November 03,2017 - 12:01 by Z_CLU

పేరుకే చిన్న సినిమా. కానీ దీని చుట్టూ చాలా బజ్ నడిచింది. అలా భారీ అంచనాల మధ్య నెక్ట్స్ నువ్వే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది. ఆది సాయికుమార్, వైభవి, రష్మి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ హారర్-కామెడీ మూవీకి తొలిరోజు పాజిటివ్ టాక్ వచ్చింది. సాంగ్స్, ట్రయిలర్ ఆల్రెడీ హిట్ అవ్వడంతో పాటు ప్రమోషన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేయడంతో.. “నెక్ట్స్ నువ్వే” మూవీకి మొదటి రోజు మంచి క్రౌడ్ కనిపించింది.

వి-4 మూవీస్ బ్యానర్ పై బన్నీ వాస్, వంశీ, జ్ఞానవేల్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు గ్రాండ్ గా పరిచయమయ్యాడు టీవీ నటుడు ప్రభాకర్. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే డైరక్టర్ గా మరో ఛాన్స్ అందుకున్నాడంటే ప్రభాకర్ టాలెంట్ ను అర్థం చేసుకోవచ్చు. ఎక్కడా కొత్త అనే ఫీలింగ్ రాకుండా సినిమాను చక్కగా తీశాడు ప్రభాకర్.

హారర్-కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందించాడు. దాదాపు 60శాతం మంది నూతన నటీనటులు, టెక్నీషియన్లతో తెరకెక్కింది నెక్ట్స్ నువ్వే సినిమా.