రేపే ఒక్కడు మిగిలాడు ప్రీ రిలీజ్ ఈవెంట్

Friday,November 03,2017 - 02:01 by Z_CLU

మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ నవంబర్ 10 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఇంటెన్సివ్ ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన సినిమా యూనిట్, రేపు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోనుంది. అల్టిమేట్ వార్ సీక్వెన్సెస్ తో పాటు, అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఎట్రాక్ట్ చేయనున్న ఈ సినిమా టాలీవుడ్ లో ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమాలో వ్యవస్థకి విరుద్ధంగా పోరాడే వీరుడిగా, మరోవైపు ప్రస్తుత పరిస్థితుల మధ్య నలుగుతున్న వ్యవస్థను ట్రాక్ పై పెట్టే లీడర్ లా కనిపించనున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి శివ నందిగామ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. S.N. రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.