మరో సినిమా ప్రకటించిన శర్వానంద్

Tuesday,August 04,2020 - 07:08 by Z_CLU

హీరో శర్వానంద్ కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. నారాయణ్ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా రాబోతున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయాన్ని ఎనౌన్స్ చేయలేదు.

శర్వానంద్ చేతిలో ఆల్రెడీ శ్రీకారం అనే సినిమా ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఇది తెరకెక్కుతోంది. ఈ మూవీతో పాటు డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై తెలుగు-తమిళ భాషల్లో శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇది కాకుండా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఇంకో సినిమా చేయబోతున్నాడు శర్వ.

ఇలా ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అప్పుడు నారాయణ్ దాస్ నారంగ్ నిర్మాణంలో ప్రకటించిన కొత్త సినిమాపై వర్క్ స్టార్ట్ చేస్తాడు శర్వా.