SHARWANAND త్రివిక్రమ్ క్లాప్ తో కొత్త సినిమా ప్రారంభం

Monday,September 05,2022 - 03:05 by Z_CLU

Sharwanand, Krishna Chaitanya,’s Film Launched In an Auspicious way

త్వరలో ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వానంద్ నెక్స్ట్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ తర్వాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకున్న శర్వా  కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా ఓపెనింగ్ కి దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ , మారుతి , చందూ మొండేటి , హను రాఘవపూడి, సుదీర్ వర్మ హాజరయ్యారు. ఫస్ట్ షాట్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్లాప్ నిచ్చారు.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. తర్వాత యూనిట్ రాజమండ్రి వెళ్లనున్నారు. అక్కడ  భారీ షెడ్యుల్ జరపనున్నారు. ‘ఛల్ మోహన్ రంగా’ తర్వాత గ్యాప్ తీసుకున్న కృష్ణ చైతన్య ఓ పవర్ ఫుల్ కథ రెడీ శర్వాతో ఈ సినిమా చేయబోతున్నాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ పై TG విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రియమణి ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకు జిమ్షి ఖాలిద్ సినిమాటోగ్రాఫర్. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది.

 

*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics