Acharya First Look.. చిరు బర్త్ డే కానుక

Tuesday,August 04,2020 - 04:43 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈనెల 22న గ్రాండ్ గా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోబోతున్నారు చిరు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ఆచార్య మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు.

ఆచార్య సినిమాకు సంబంధించి ఇప్పటికే చిరంజీవి టైటిల్ బయటపెట్టారు. ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ.. తనే అనుకోకుండా సినిమా టైటిల్ చెప్పేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఆచార్య. సినిమా షూటింగ్ 40శాతం పూర్తయింది. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు జాయింట్ గా నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీత దర్శకుడు.