జీ ఎక్స్ క్లూజివ్: చందు మొండేటి దర్శకత్వంలో..!

Friday,February 22,2019 - 11:59 by Z_CLU

విలక్షణ చిత్రాల దర్శకుడు చందు మొండేటి మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. రీసెంట్ గా సవ్యసాచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన ఈ డైరక్టర్.. త్వరలోనే శర్వానంద్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని జీ సినిమాలు తో ఎక్స్ క్లూజివ్ గా షేర్ చేసుకున్నాడు ఈ దర్శకుడు.

సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్న శర్వానంద్, ఆ మూవీ కంప్లీట్ అయిన వెంటనే దిల్ రాజు బ్యానర్ లో 96 రీమేక్ ను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఈ రెండు మూవీస్ తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో నటించబోతున్నాడు.

అలవాటు లేని ఎడమ చేతికి అమోఘమైన శక్తి ఉంటే ఎలా ఉంటుందో సవ్యసాచి సినిమాలో చూపించాడు చందు మొండేటి. అంతకంటే ముందు ప్రేమమ్ సినిమాతో సున్నితమైన ప్రేమ భావాల్ని పరిచయం చేశాడు. ఇప్పుడు శర్వానంద్ తో కలిసి మరో డిఫరెంట్ జానర్ ట్రై చేయబోతున్నాడు ఈ దర్శకుడు.