Sekhar Kammula, Dhanush Movie - మల్టీస్టారర్ అవుతుందా?

Saturday,July 03,2021 - 03:41 by Z_CLU

Sekhar Kammula, Dhanush Movie is a Multi starrer

ఎవరూ ఊహించని విధంగా ‘లవ్ స్టోరి’ తర్వాత కోలీవుడ్ స్టార్ ధనుష్ తో పాన్ ఇండియా సినిమాను ఎనౌన్స్ చేశాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరి నిర్మాతలతో ఈ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు. ఇటివలే ధనుష్ ని హైదరాబాద్ లో కలిసి డిస్కషన్ కూడా జరిపారు మేకర్స్.స్క్రిప్ట్ నరేషన్, షెడ్యుల్స్ వైగైరా అన్నీ డిస్కస్ చేసుకున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని హింట్ ఇచ్చారు.

Sekhar Kammula Dhanush Movie

అయితే ఈ సినిమాలో ధనుష్ తో పాటు మరో హీరో కూడా ఉంటాడని, శేఖర్ కమ్ముల ఈ సినిమాను మల్టీ స్టారర్ తో తెరకెక్కించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆ హీరోని ఫైనల్ చేసే పనిలోనే ఉన్నారట మేకర్స్. టాలీవుడ్ నుండి ఓ స్టార్ ని ప్రాజెక్ట్ లోకి తీసుకునే ఆలోచనలో శేఖర్ , నిర్మాతలు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయంపై త్వరలోనే మేకర్స్ నుండి క్లారిటీ రానుంది. మరి ధనుష్ తో పాటు ఈ సినిమాలో కనిపించనున్న మరో హీరో ఎవరా ? అని ప్రెజెంట్ చర్చ నడుస్తుంది.

ఇక ఒక్కో సినిమాతో నటుడిగా ఎదుగుతూ క్రేజ్ పెంచుకుంటున్న ధనుష్ ను శేఖర్ కమ్ముల ఎలా చూపించనున్నాడు ? అసలు ఈ హీరోతో ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అనేది ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. క్యూట్ లవ్ స్టోరీస్ తో సాఫ్ట్ సినిమాలు చేసే శేఖర్ కమ్ముల ధనుష్ తో ఏదైనా పెద్ద ప్రయోగం చేస్తాడేమో చూడాలి. అలాగే ఇది మల్టీ స్టారర్ ఆ ? కదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics