NagaChaitanya - ఆ డైరెక్టర్ తో సినిమా?

Saturday,July 03,2021 - 03:50 by Z_CLU

ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య మంచి ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. త్వరలోనే లవ్ స్టోరి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చైతు ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. దీని తర్వాత నాగార్జునతో కలిసి బంగార్రాజు లో ఓ రోల్ చేయబోతున్నాడు చైతు. ఆ సినిమా తర్వాత కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడట అక్కినేని హీరో.

NagaChaitanya_Samantha_at_Dil_Raju_Birth_day_Party

                                   భార్య సమంతతో నాగచైతన్య

ఇటివలే చైతు ని కలిసి కిషోర్ తిరుమల ఓ యూత్ ఫుల్ సబ్జెక్ట్ చెప్పాడట. లవ్ స్టోరిలో ఎంటర్టైన్ మెంట్ మిక్స్ అయి ఉన్న ఆ కథ చైతు కి బాగా నచ్చడంతో కిషోర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ కాంబో సినిమాను డి వి వి ఎంటర్టైన్ బేనర్ పై దానయ్య నిర్మిస్తారని సమాచారం. ప్రస్తుతం కిషోర్ తిరుమల శర్వానంద్ తో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యే లోపు చైతు తనకున్న కమిట్ మెంట్స్ ఫినిష్ చేసి ఫ్రీ అవుతాడు. ఇద్దరు ఫ్రీ అవ్వగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. త్వరలోనే మేకర్స్ నుండి ఈ సినిమాకు సంబంధించి ప్రకటన రానుందని తెలుస్తుంది.

director-kishore-tirumala-zee-cinemalu

దర్శకుడు కిషోర్ తిరుమల

రెడ్ సినిమాతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు కిషోర్ ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఆ సినిమా తర్వాత చైతు మిగతా హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics