Dhanush Sekhar Kammula Movie - ఇంతకీ కథేంటి

Tuesday,June 22,2021 - 11:49 by Z_CLU

ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. శేఖర్ కమ్ముల లాంటి విలక్షణ దర్శకుడు, ధనుష్ తో పాన్ ఇండియా మూవీకి రెడీ అవ్వడం దాదాపు ఓ వింతగానే చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇక్కడ చాలా అంశాలున్నాలు ముడిపడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం శేఖర్ కమ్ముల కమర్షియల్ దర్శకుడు కాదు. ఆయన సెన్సిబుల్ దర్శకుడు.

ముందుగా కమ్ముల విషయాన్నే తీసుకుందాం. ఈ దర్శకుడు కొట్టిన హిట్స్ అన్నీ ప్రేమకథలే. మరీ ముఖ్యంగా అన్నీ లోకల్ ఫ్లేవర్ కథలు. అంటే మన నేటివిటీకి తగ్గ స్టోరీ లైన్స్ అన్నమాట. ఫిదా అయినా, హ్యాపీ డేస్ అయినా, చివరికి ఓ మోస్తరుగా ఆడిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అయినా ఇవన్నీ మన కథలు. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా అప్పీల్ లేని కథలు. మాస్ ఎలిమెంట్స్ అస్సలు కనిపించని కథలు. ఇలాంటి కథలు చెప్పిన కమ్ముల నుంచి ఓ పాన్ ఇండియా మూవీ అంటే ఆశ్చర్యం కాక ఇంకేంటి. ఇక్కడ అనామిక సినిమాను ప్రస్తావించడం లేదు. ఎందుకంటే అది రీమేక్.

ఓ పాన్ ఇండియా సినిమా తీయాలంటే ముందుగా కావాల్సింది అందరికీ ఆమోదయోగ్యమైన కథ. అలాంటి కథను కమ్ముల రాశాడనే అనుకోవాలి. లేదంటే ధనుష్ లాంటి హీరో ఈ ప్రాజెక్టులోకి రాడు. అతడో విలక్షణ నటుడు. క్యారెక్టర్స్, కథల ఎంపికలో ధనుష్ కు తిరుగులేదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా మంచి పాత్రలు పోషిస్తుంటాడు ఈ హీరో.

అలాంటి ధనుష్, శేఖర్ కమ్ముల కథకు ఓకే చెప్పాడంటే కచ్చితంగా అది మంచి కథ, సరికొత్త పాత్ర అయి ఉంటుంది. ఇంతవరకు ఓకే. కానీ మరో సందేహం చాలామందికి ఉంది. ప్రేమకథలతో మాత్రమే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడీ దర్శకుడు ధనుష్ తో కూడా ప్రేమకథనే తీయబోతున్నాడా అనేది అందరి డౌట్.

dhanush-sekhar-kammula

కమ్ముల యూనిట్ నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు శేఖర్ కమ్ముల టచ్ చేయని అంశంతో ఈ సినిమా రాబోతోంది. అటు ధనుష్ కూడా ఇప్పటివరకు పోషించిన క్యారెక్టర్ ఇది. ఈ సంగతి పక్కనపెడితే.. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది. అందుకే శేఖర్ కమ్ముల దీన్ని లార్జ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నాడు.

కథకు ఏది అవసరమో దాన్ని సాధించే వరకు నిద్రపోడు కమ్ముల. అలాంటి వ్యక్తి ఇలా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాకు రెడీ అవుతున్నాడంటే, కచ్చితంగా అతడు రాసుకున్న కథకు యూనివర్సల్ అప్పీల్ ఉందని అర్థం చేసుకోవాలి. ఇక ధనుష్ లాంటి జాతీయ అవార్డ్ గ్రహీతను తీసుకున్నాడంటే, ఈ కథలో చాలా డెప్త్ ఉందనే విషయం కూడా అర్థమౌతోంది. చూస్తుంటే.. ఈ డిఫరెంట్ కాంబినేషన్ ట్రెండ్ సెట్ చేసేలా ఉంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics