Movie Review - జగమే తంత్రం

Friday,June 18,2021 - 06:57 by Z_CLU

నటీ నటులు : ధనుష్ , ఐశ్వర్య లెక్ష్మి,జేమ్స్ కస్మో, జోజు జార్జ్, కళయరాసన్ తదితరులు

కెమెరామెన్ : శ్రేయాస్ కృష్ణ

సంగీతం : సంతోష్ నారాయణ్

నిర్మాతలు : శశి కాంత్ , చక్రవర్తి రామచంద్ర

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్

విడుదల తేది : 18 జూన్ 2021

నిడివి : 153 నిమిషాలు

ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగమే తంత్రం’ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కోవిడ్ 19 కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు OTT ద్వారా రిలీజైంది. మరి వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న ధనుష్ ఈ సినిమాతో OTT బ్లాక్ బస్టర్ అందుకున్నాడా ? కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను ఎలా డీల్ చేశాడు ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

jagame thanthram movie review zeecinemalu 1
కథ :

లండన్ లో పీటర్ (జేమ్స్ కాస్మో) , శివ దాస్ (జోజు జార్జ్) అనే రెండు గ్యాంగుల మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. శివదాస్ ఆలోచనలు తెలుసుకొని అతన్ని దెబ్బతీసే వ్యక్తి కోసం చూస్తున్న పీటర్ తమిళ్ నాడులో ఉన్న సురులి(ధనుష్) ని లండన్ కి పిలిపిస్తాడు. అలా లండన్ కొచ్చి పీటర్ గ్యాంగ్ లో చేరిన సురులి శివ దాస్ చేసే పనులపై దృష్టి పెట్టి అతని విషయలు పీటర్ కి తెలియజేస్తూ దెబ్బ తీస్తుంటాడు. అలా లండన్ లో సెటిలయిన సురులి అటిల్లా(ఐశ్వర్య లెక్ష్మి) అనే అమ్మాయిని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు.

పీటర్ ఆఫర్ చేసిన డబ్బు కోసం లండన్ వెళ్ళిన సురిలి అక్కడికి వెళ్ళాక ఎలాంటి జీవితం గడిపాడు ? ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ? లండన్ లో గ్యాంగ్ స్టర్ గా మారిన సురిలి చివరికి విలన్ పీటర్ కి ఎదురెళ్ళి అక్కడి శరణార్ధులను ఎలా ఆదుకున్నాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

ధనుష్ ఎప్పటిలాగే తన క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు. గ్యాంగ్ స్టర్ గా మెప్పించాడు. కాకపోతే బలమైన సన్నివేశాలు లేకపోవడంతో నటనకి ఎకువ స్కోప్ లేకుండా పోయింది. ఐశ్వర్య లెక్ష్మి తన పాత్రకు న్యాయం చేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎప్సిసోడ్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో నటనతో ఆకట్టుకుంది. పీటర్ పాత్రకు జేమ్స్ , శివ దాస్ పాత్రకు జోజు సూటయ్యారు. కళయరాసన్, సౌందర రాజ, దీపక్ పరమేష్ , శరత్, దేవన్ ,సంచన నటరాజన్ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు టెక్నికల్ గా బెస్ట్ సపోర్ట్ ఇచ్చిన ఇద్దరి గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. అందులో ఒకరు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ , మరొకరు కెమెరామెన్ శ్రేయాస్ కృష్ణ. మ్యూజిక్ పరంగా సంతోష్ నారాయణ్ బెస్ట్ ఇస్తే, విజువల్స్ పరంగా కృష్ణ బెస్ట్ ఇచ్చాడు. సినిమా చూస్తున్నత సేపు ఈ ఇద్దరి ఎఫర్ట్ కనిపిస్తుంది. వివేక్ హర్షన్ పరవాలేదు. సంతానం, వినోథ్ రాజు కుమార్ ఆర్ట్ వర్క్ బాగుంది. దినేష్ సుబ్రహ్మణ్యం స్టంట్ కంపోజిషన్ మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. రాజన్ సౌండ్ డిజైనింగ్ కూడా బాగుంది.

కార్తీక్ సుబ్బరాజు కథ -కథనంతో సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకొని మంచి ట్విస్టులు ప్లాన్ చేసుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

jagame thanthram movie review zeecinemalu 1

జీ సినిమాలు సమీక్ష :

రెండు గ్యాంగ్ స్టర్ల మధ్య గొడవలు మధ్యలో హీరో ఒక గ్యాంగ్ లో చేరి అపోజిట్ గ్యాంగుని దెబ్బ తీయడం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన కథ. అదే కథతో జగమే తంత్రం సినిమా తీశాడు కార్తీక్ సుబ్బరాజు. కాకపోతే శరణార్థులు అనే కాసేపట్ జత చేశాడు. అది కూడా గ్యాంగ్ స్టర్ సినిమాల్లో చెప్పిన పాయింటే కావడంతో అది కూడా ఆసక్తిగా అనిపించదు. పైగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా పండలేదు. దాంతో ఎక్కడా ఎమోషన్ క్యారీ అవ్వలేదు.

తొలి పది నిమిషాలు కాస్త స్పీడుతో ఎక్స్ ప్రెస్ లాంటి స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపించిన దర్శకుడు ఆ తర్వాత ప్యాసింజర్ లా నత్త నడకన సినిమాను నడిపించిన విధానం విసుగు తెప్పిస్తుంది. దాంతో నిడివి సరిగ్గా ఉన్నా రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇలాంటి సినిమాలను ఫటా ఫట్ సీన్స్ తో అదిరిపోయే ట్విస్టులతో తెరకెక్కించాలి. లేదంటే బోర్ కొట్టేస్తుంది. సినిమాలో ఇంటర్వెల్ కి ముందు దర్శకుడు కార్తీక్ ఓ ట్విస్ట్ ప్లాన్ చేసినప్పటికీ అది కూడా గెస్ చేసేలానే ఉండటంతో వావ్ అనిపించలేదు.

సినిమా ఆరంభంలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ చూసి ఏదో ఊహించిన ప్రేక్షకులకు ఆ సన్నివేశాన్ని చాలా సిల్లీగా తీసి అక్కడి నుండే సినిమాపై అంచనాలు తగ్గించేశాడు దర్శకుడు. లండన్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు మినహా సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా బలమైన సన్నివేశాలు అదిరిపోయే స్కీన్ ప్లే లేదు. దీంతో ఆసక్తి కరంగా తీయలేకపోయిన గ్యాంగ్ స్టర్ సినిమాల్లో ఇది కూడా ఒకటిలా ఉంటుందే తప్ప హిట్ సినిమాల్లో చేరలేకపోయింది.

నిజానికి కార్తీక్ సుబ్బరాజ్ నుండి సినిమా వస్తుందంటే తమిళ్ ఆడియన్స్ తో పాటు అతని సినిమాలు ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కూడా చాల ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. అలా ఈ సినిమాపై ఎక్కువ ఊహించుకున్న ఆడియన్స్ జగమే తంత్రం చూసి నిరాశ పడటం ఖాయం. ఇక టైం పాస్ కోసం OTT లో సినిమాలు చూసే వారికి ఈ సినిమా జస్ట్ పరవాలేదనిపిస్తుంది. ఓవరాల్ గా ధనుష్ -సుబ్బరాజ్ కాంబో నిరాశ పరిచి పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

రేటింగ్ : 2.25/5