#Lovestory రిలీజ్ డేట్ లాక్ ?

Saturday,July 03,2021 - 03:32 by Z_CLU

నాగ చైతన్య , సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరి’ త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ వరకు వచ్చిన ఈ సినిమా కరోన సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అప్పటి నుండి ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. సాంగ్స్ తో పాటు టీజర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు నెలకొంటున్నాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న సినిమా కావడం, పైగా చైతూ , సాయి పల్లవి ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా ? అని ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమాను OTT లో డైరెక్ట్ చేస్తారనే టాక్ వినబడింది. కానీ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని ఆగస్ట్ లో రిలీజ్ ఉంటుందని ప్రకటించారు నిర్మాత సునీల్ నారంగ్. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నట్లు సమాచారం. ఆగస్ట్ 30న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రమోషన్ కి సంబంధించి ప్లాన్ కూడా రెడీ అవుతుందట. ఈ నెలలోనే ప్రమోషన్ మొదలు పెట్టి వచ్చే నెలలో థియేటర్స్ లో సందడి చేయనున్నారు చైతు, సాయి పల్లవి.

love story nagachaitanya sai pallavi

‘లవ్ స్టోరీ’లో చైతూ, సాయిపల్లవి

శేఖర్ కమ్ముల స్టైల్ ఆఫ్ మేకింగ్ లో క్యూట్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమాకు పవన్ అందించిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎసెట్. సారంగ దరియా సాంగ్ మిలియన్ వ్యూస్ కొల్లగొడుతూ దూసుకెళ్తుంది. సినిమాలో ఆ సాంగ్ మెయిన్ హైలైట్ అవ్వనుందని ప్రోమో చూస్తేనే అర్థమైపోతుంది. డ్యాన్స్ నేపథ్యంతో చక్కని ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాకు నారాయణ దాస్ నారంగ్ , రామ్మోహన్ రావు నిర్మాతలు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics