10 రికార్డులు బ్రేక్ చేసిన సల్మాన్ ఖాన్ రేస్ 3

Friday,June 22,2018 - 07:42 by Z_CLU

సల్మాన్ ఖాన్ రేస్ 3 సినిమా రిలీజవ్వగానే సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ వినిపించినా సల్మాన్ స్టామినా ముందు ఏదీ నిలబడలేకపోయింది. ఫిల్మ్ మేకర్స్ చేసిన భారీ ప్రమోషన్స్ సల్మాన్ ఖాన్ కి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్, అన్నీ కలగలిసి, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న రేస్ 3, ఏకంగా 10 రికార్డులు బ్రేక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

హయ్యెస్ట్ ఆక్యుపెన్సీ…

ఈద్ కానుకగా రిలీజైన ఈ సినిమా మార్నింగ్ షోస్ లో 72% శాతం ఆక్యుపెన్సీ తో బాగి 2, పద్మావత్, వీరే ది వెడ్డింగ్ లాంటి మరెన్నో సినిమాల రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.

2018 హయ్యెస్ట్ ఓపెనర్  

సినిమా రిలీజ్ కి ముందే భారీ క్రేజ్ క్రియేట్ చేసుకోవడం సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా, ఫస్ట్ డే 29.17 కోట్లు వసూలు చేసి, 25.10 కోట్లు వసూలు చేసిన బాగి, 24 కోట్లు వసూలు చేసిన పద్మావత్ రికార్డులను ఈజీగా క్రాస్ చేసేసింది.

హయ్యెస్ట్ సింగిల్ డే – 2018

రేస్ 3, మూడో రోజు (ఆదివారం) వసూళ్లు 39.16 కోట్లు. 2018 లో సింగిల్ డే లో ఆ రేంజ్ లో కలెక్ట్ చేసిన సినిమా ఇదొక్కటే కావడం విశేషం.

 

సెకండ్ హయ్యెస్ట్ వీకెండ్ – 2018

ఓపెనింగ్ వీకెండ్ లో 106.47 వసూలు చేసిన రేస్ 3 సెకండ్ హయ్యెస్ట్ వీకెండ్ గ్రాసర్ గా నిలిచింది. హిందీ తో పాటు తెలుగు, తమిళ భాషలలోను రిలీజైన పద్మావత్ 114 కోట్లు వసూలు చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, జస్ట్ హిందీ ఒక్క  భాషలోనే రిలీజైన రేస్ 3 సెకండ్ ప్లేస్ ని ఆక్యుపై చేయడం విశేషం.

3 రోజుల్లోనే 100 కోట్లు

పద్మావత్, బాగి 2 సినిమాలు 8 రోజుల్లో 100 కోట్లు వసూలు చేస్తే, సల్మాన్ ఖాన్ రేస్ 3, కేవలం 3 రోజుల్లో 100 కోట్ల బెంచ్ మార్క్ ని క్రాస్ చేసింది.

హయ్యెస్ట్ గ్రాసర్ – రేస్ ఫ్రాంచైజీ

రేస్ 2 ఓవరాల్ గా 102 కోట్లు వసూలు చేస్తే, సల్మాన్ ఖాన్ రేస్ 3 జస్ట్ 3 రోజుల్లో, ఆ నంబర్ ని వెనక్కి నెట్టేసింది.

హయ్యెస్ట్ కలెక్షన్ – ఈద్

ఈద్ ట్రీట్ గా రిలీజైన రేస్ – 3, సల్మాన్ ఖాన్ సుల్తాన్ రికార్డ్స్ ని కూడా ఈజీగా క్రాస్ చేసింది. ఆ ఒక్క రోజే 38.14 వసూలు చేసి, 36.54 కోట్లు వసూలు చేసిన సుల్తాన్ ని రేస్ లో వెనక్కి నెట్టేసింది.

 

సెకండ్ హయ్యెస్ట్ – ఓపెనింగ్ వీక్ గ్రాసర్

దీపికా పాడుకొనే పద్మావత్ ఫస్ట్ ఓపెనింగ్ వీక్ లో 166.50 కోట్లు వసూలు చేస్తే, సల్మాన్ ఖాన్ రేస్ 3, 150 కోట్లు వసూలు చేసి సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

సొంత 100 కోట్ల రికార్డులు

సల్మాన్ ఖాన్ కరియర్ లో జస్ట్ 3 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసిన ‘రేస్ 3’ నాలుగవ సినిమా. భజరంగి భాయ్ జాన్, సుల్తాన్, టైగర్ జిందా హై తరవాత ఇప్పుడీ సినిమా కూడా ఆ లిస్టులో చేరింది. అయితే  ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ తో కంపేర్ చేస్తే 114. 53 వసూలు చేసిన ‘టైగర్ జిందా హై’ తరవాత ఇమ్మీడియట్ గా 106.47 కోట్లు వసూలు చేసి సెకండ్ ప్లేస్ లో నిలిచింది రేస్ 3.

సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ – 2018

డొమెస్టిక్ గానే కాదు ఓవర్ సీస్ బాక్సాఫీస్ ని కూడా లెక్కల్లోకి తీసుకుంటే 181.32 కోట్లు వసూలు చేసి, 215 కోట్లు వసూలు చేసిన పద్మావత్ తరవాత రెండో స్థానంలో నిలిచింది సల్మాన్ ఖాన్ రేస్ 3.