అక్కడ త్రిష.. ఇక్కడ సమంతా

Friday,May 17,2019 - 12:03 by Z_CLU

96 రీమేక్ లో నటించనుంది సమంతా. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కనిపించనుంది. అయితే ఈ సినిమాకి ‘ఏ మాయ చేశావే’ సినిమాకి ఒక విషయంలో సిమిలారిటీస్ ఉన్నాయి. అదే మరో స్టార్ హీరోయిన్ త్రిష.

 ‘ఏ మాయ చేశావే’ తమిళ వర్షన్ లో నటించింది త్రిష. కానీ అదే సినిమా తెలుగులో వచ్చేసరికి హీరోయిన్ సమంతా. ఇప్పుడు ‘96’ సినిమా విషయంలో కూడా తమిళంలో త్రిష హీరోయిన్. సినిమా బ్లాక్ బస్టర్. తెలుగులో వచ్చేసరికి ఆ ప్లేస్ లో సమంతా ఫిక్సయింది.

సమంతా కి కూడా కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది కాకపోతే కథ ఒరిజినల్ వర్షన్ లో హీరోయిన్ మరీ యంగ్ లుక్స్ లో కాకుండా కొంచెం సీనియర్ గా కనిపించాలి. అందుకే త్రిష అయితేనే అక్కడ పర్ఫెక్ట్. కానీ అదే సినిమా ఇక్కడికి వచ్చేసరికి సమంతా హీరోయిన్ గా ఫిక్సయింది. అలా ‘ఏ మాయ చేశావే’ సినిమాకి ‘96’ కి లింక్ కుదిరింది.

ఇంకో మాట చెప్పాలంటే త్రిషకి సూటయ్యే కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ సమంతా కి ఈజీగా సూటవుతున్నాయి. దానికి తోడు సినిమాలో పెద్దగా గ్లామర్ షో, కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటి జిమ్మిక్స్ ఉండవు కాబట్టి కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితేనే బెటరని మేకర్స్ ఫిక్సయి ఉంటారు..