‘మేఘా ఆకాష్’ వరస మార్చుకోవాల్సిందే...

Friday,May 17,2019 - 12:03 by Z_CLU

ఫస్ట్ టైమ్ చూసినప్పుడు టాలీవుడ్ కి ఇంకో స్టార్ హీరోయిన్ దొరికేసింది అనిపించింది. మొదటి సినిమాకి నితిన్ సరసన ‘లై’ సినిమాలో చాన్స్ కొట్టేసింది. అదృష్టం ఎంతగా కలిసొచ్చిందంటే ఈ సినిమా తరవాత ‘ఛల్ మోహనరంగ’ సినిమాకి కూడా మేఘా ఆకాష్ నే ప్రిఫర్ చేశాడు నితిన్. అంతేకానీ మేఘా ఆకాష్ మాత్రం ఏమీ చేయలేదు.

గ్లామర్ కి గ్లామర్.. పర్ఫామెన్స్ విషయంలో కూడా పెద్దగా వంకలు పెట్టే అవకాశం ఇవ్వదు మేఘా. కానీ ఆఫ్ స్క్రీన్ వరకు వస్తే మేఘా ఆకాష్ కి హీరోయిన్ కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా లేదనిపిస్తుంది. మహా అయితే సినిమా రిలీజ్ కి ముందు కో స్టార్స్ తో కలిసి, వాళ్ళు చెప్పినదానికి వంత పాడటం తప్పితే, స్వతంత్రంగా తన మార్క్ క్రియేట్ చేసే స్థాయిలో ఎప్పుడూ తనను తాను ప్రమోట్ చేసుకోలేదు మేఘా.

నితిన్ తో చేసిన 2 సినిమాల తరవాత కరెక్ట్ గా ప్లాన్ చేసుకోగలిగితే ఈజీగా మరో 4 సినిమాలు ఈజీగా చేసుకోగలిగేది మేఘా. కానీ సరిగ్గా అదే టైమ్ లో కోలీవుడ్ పై కాన్సంట్రేట్ చేయడం, ఇక్కడ ఫ్యాన్స్ తో కనెక్టివిటీ బిల్డ్ కాకపోవడం వెరసి, మేఘా ఆకాష్ అంటే.. ఎవరు..? అనే స్టేజ్ కి వచ్చేసింది.

ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళీ డెబ్యూ హీరో శివ కందుకూరి తో జోడీ కడుతుంది మేఘా. నితిన్ రేంజ్ స్టార్ హీరోతో లాంచ్ అయి, ఇప్పుడు కొత్త హీరో స్టాండర్డ్స్ కి పడిపోయిందని చిన్న రిగ్రేట్ ఉన్నా, ఈసారైనా వరస మార్చి, ఫ్యాన్స్ లో క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి..