మరికొన్ని గంటల్లో సమంత ఫస్ట్ లుక్ రిలీజ్

Thursday,February 08,2018 - 06:34 by Z_CLU

రంగస్థలంలో సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు ఎలా ఉంటాడో చూశాం. మరి ఈ సినిమాలో సమంత ఎలా కనిపించబోతోంది… ఆమె క్యారెక్టర్ ఏంటి.. మరికొన్ని గంటల్లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. సమంత పాత్ర పేరును రామలక్ష్మిగా ప్రకటించిన యూనిట్.. ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతోంది.

రంగస్థలంలో సమంత ఎలా ఉండబోతోంది.. ఆమె లుక్ ఏంటనే విషయంపై ఇప్పటికే చాలామందికి ఓ ఐడియా ఉంది. ఎందుకంటే సమంతకు సంబంధించి ఆమధ్య కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. దీనిపై పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చారు మేకర్స్. అయితే రేపు రిలీజ్ కాబోతున్న టీజర్ లో ఆమె యాస, భాష ఎలా ఉంటుందనే యాంగిల్ లో అందర్లో క్యూరియాసిటీ ఉంది.

1985 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ లో ఉంది. ఈ ఆదివారం (ఫిబ్రవరి 11)తో టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. మార్చి ఫస్ట్ వీక్ లో ఆడియోను విడుదల చేసి, మార్చి 30న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.