అమెరికాలో రవితేజ కొత్త సినిమా ప్రారంభం

Thursday,February 08,2018 - 04:32 by Z_CLU

రవితేజ నెక్ట్స్ సినిమా షూటింగ్ కు డేట్ ఫిక్స్ అయింది. శ్రీనువైట్ల డైరక్షన్ లో మాస్ రాజా నటించనున్న కొత్త సినిమా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మూవీకి సంబంధించి ముహూర్తం షాట్ ను హైదరాబాద్ లో లాంఛనంగా నిర్వహించి, ఈనెల 19 నుంచి అమెరికాలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రానున్న ఈ సినిమాలో 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు రవితేజ. ఈ మూవీకి అమర్-అక్బర్-ఆంటోనీ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. అఫీషియల్ టైటిల్ ను ఇంకా ఎనౌన్స్ చేయలేదు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు.

యూఎస్ షెడ్యూల్ కు వెళ్లేలోపు ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను ఓ కొలిక్కి తీసుకురాబోతున్నాడు రవితేజ. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు నేలటిక్కెట్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.