నాగార్జున 'వైల్డ్ డాగ్'లో సయామీ ఖేర్

Monday,January 27,2020 - 03:29 by Z_CLU

రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్ట్ చేసిన బాలీవుడ్ మూవీ ‘మిర్జియా’తో పరిచయమైన నటి సయామీ ఖేర్. గతేడాది తన మరాఠీ మూవీతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న ఆమె, ఇప్పుడు తెలుగులో నాగార్జున సరసన నటించనుంది. పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఫిలింగా తయారవుతున్న ‘వైల్డ్ డాగ్’లో ఒక యాక్షన్ రోల్ చేసేందుకు సయామీ రెడీ అవుతోంది.

యథార్థ ఘటనల స్ఫూర్తితో రాసిన కథతో సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో NIA ఆఫీసరుగా నాగార్జున నటిస్తున్నారు. సయామీ ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనుంది. ఆమెపై కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ సీన్లు ఉంటాయంటోంది యూనిట్. దీని కోసం ఆమె ముంబైలో శిక్షణ కూడా తీసుకుంటోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ లో సయామీ జాయిన్ అవుతుంది.

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’కు పనిచేసిన డేవిడ్ ఇస్మాలోన్ ‘వైల్డ్ డాగ్’కు యాక్షన్ డైరెక్టరుగా పనిచేస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఇప్పటికే దియా మీర్జాను ఓ హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.

సాంకేతిక వర్గం:
రచన-దర్శకత్వం: అహిషోర్ సాల్మన్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాతలు: ఎన్.ఎం. పాషా, జగన్మోహన్ వంచ
సినిమాటోగ్రఫీ: షానీల్ డియో
యాక్షన్: డేవిడ్ ఇస్మాలోన్
డైలాగ్స్: కిరణ్ కుమార్
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
ప్రొడక్షన్ డిజైనర్స్: సతీష్ పోట్దర్, ప్రశాంత్ దేష్మనే
ఆర్ట్ డైరెక్టర్: మురళి ఎస్.వి.