Monday,March 29,2021 - 08:29 by Z_CLU
– నాగ్‌సార్‌కి నేను పెద్ద అభిమానిని. ఆయన శివ సినిమా చూశాను. కానీ ఆయన సినిమాల్లో నా ఫెవరెట్ ‘గీతాంజలి’. ఈ సినిమాకు ముందు నాగ్‌సార్‌ని నేను కలవలేదు. ఈ సినిమా షూట్ కోసం కలిశాను. ఓ ఉగ్రవాదిని విచారంచే ఓ సన్నివేశం మా ఇద్దరి కాంబినేషన్లో ఉంటుంది. మొదట్లో నాగ్‌సార్ అనగానే నేను కాస్త నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ నాగ్‌సార్ సెట్లో చాలా సరదగా ఉంటారు. అందరు ఆయనతో కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఓ సారి నాగ్‌సార్ ఇంటి నుంచి బిర్యానీ తెచ్చారు. ఆ ఫుడ్ బాగా ఎంజాయ్ చేశాను. అలీ రెజా కూడా మంచి కో స్టార్. నిర్మాత నిరంజన్‌రెడ్డిగారు కూడా బాగా హెల్ప్ చేశారు.
– ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. నా పాత్ర గురించి చెప్పగానే ఎగై్జట్ అయ్యాను. సాధారణంగా హీరోయిన్ పాత్రలకు పెద్దగా యాక్షన్ సీక్వెన్స్ ఉండవు. కానీ ఈ సినిమా నాకు చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. నాగ్‌సార్‌తో కూడా ఓ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. నాకు స్పోర్ట్స్‌లో మంచి ప్రావీణ్యత ఉంది. స్పోర్ట్స్ అంటే చాలా ఫిట్నెస్తో ఉండాలి. ఆ ఫిట్నెస్ నాకు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు చేసేందుకు ఉపయోగపడింది. అంతేకాదు ఈ సినిమా కోసం నేను ముంబైలో మార్షల్స్ ఆర్ట్స్‌లో నెలరోజులు ప్రత్యేకశిక్షణ తీసుకున్నాను. వైల్డ్‌డాగ్ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి.
– ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్లోని కొందరు తెలుగులో మాట్లాడేవారు. అలా నాకు తెలుగు కొంచెం అర్ధమవు తుంది. ప్రతి యాక్టర్‌కు కొందరితో వర్క్ చేయాలని ఉంటుంది. హీరోస్లో ప్రభాస్ అల్లుఅర్జున్ అంటే చాలా ఇష్టం. వారితో పనిచేయాలని ఉంది. అలాగే దర్శకుల్లో రాజమౌళి, మణిరత్నం నా ఫెవరెట్. తరుణ్‌భాస్కర్ డైరెక్ట్ చేసిన పెళ్ళిచూపులు సినిమాకు బాగా నచ్చింది.
Wednesday,April 05,2023 04:55 by Z_CLU
Monday,October 03,2022 04:45 by Z_CLU
Thursday,August 26,2021 06:24 by Z_CLU
Saturday,May 01,2021 06:15 by Z_CLU