మెహరీన్ కౌర్ ఇంటర్వ్యూ

Monday,January 27,2020 - 04:03 by Z_CLU

‘అశ్వత్థామ’లో నాగశౌర్య సరసన నటించింది మెహరీన్. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సక్సెస్ గ్యారంటీ అని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన మెహరీన్ ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడింది. అవి మీకోసం.

అశ్వత్థామ అంటే…

‘అశ్వత్థామ’ అంటే చెడుకు వ్యతిరేకంగా నిలిచేవాడు. ఈ టైటిల్ కి సినిమాలో 100% జస్టిఫికేషన్ ఉంటుంది.

నాగశౌర్య కి అలా…  

నాగశౌర్య ఫ్రెండ్ సర్కిల్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న కథ ఇది. ఈ సినిమా నాగశౌర్యకి చాలా ఇంపార్టెంట్…

పెద్దగా రెస్పాండ్ అవ్వను..

అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు నేను అందరిలా సోషల్ మీడియాలో పెద్దగా రియాక్ట్ అవ్వను. రియాక్ట్ అవ్వడం వల్ల సొల్యూషన్స్ వస్తాయని నేను అనుకోను. నా దృష్టిలో మనందరిలోనూ అశ్వత్థామ ఉంటాడు. తనని మనందరం బయటికి తీసుకురావాలి.

నా దృష్టిలో అందరూ అంతే…

సినిమాలో విలన్ రోల్ ఫిక్షనల్ కానీ, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా పట్టించుకోకుండా ఉండే వాళ్ళంతా నా దృష్టిలో విలన్సే.

సినిమాలు మాధ్యమం మాత్రమే…

సినిమాలనేవి కేవలం మాధ్యమం మాత్రమే. మార్పు అనేది మనలో రావాలి.

హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్…

ట్రైలర్ లో చూసిన మూమెంట్ సినిమాలో చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. హీరో సిస్టర్ కి జరిగిన పెయిన్ ఫుల్ ఇన్సిడెంట్ తో హీరో జర్నీ బిగిన్ అవుతుంది.

ఒక్కోసారి సినిమా కోసం…

సినిమాలో నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే చెప్పలేను కానీ సినిమాలో నా క్యారెక్టర్, హీరోకి చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. ఒక్కోసారి మన క్యారెక్టర్ కోసం కాకుండా మంచి సినిమాలో పార్ట్ అవ్వడం కోసం చేస్తాను. ఈ సినిమా అలాంటిదే.

నో కామెడీ – కమెడియన్స్…

అశ్వత్థామ కంప్లీట్ గా సీరియస్ సినిమా. గ్రిప్పింగ్ థ్రిల్లర్. ఈ సినిమాలో కామెడీ లేదు, కమెడియన్స్ కూడా ఉండరు.

ఇద్దరికీ కొత్తే…

ఈ సినిమా నాకైనా, నాగశౌర్య కైనా కొత్తే.  ఇలాంటి సినిమాలు ఇద్దరిలో ఎవరూ చేయలేదు. నాగశౌర్య కి  ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ఈ సినిమాతో మారబోతుంది.

 

నాగశౌర్య జస్ట్ నటించాడంతే…

నాగశౌర్య కథ రాసుకున్నాడు. ఆ తరవాత ఈ సినిమాలో నటించాడు అంతవరకే. ఆ తరవాత స్టోరీ న్యారేట్  చేయడం దగ్గరి నుండి డైరెక్షన్ వరకు చేసుకున్నది తేజ గారే. ఇందులో నాగశౌర్య ఇన్వాల్వ్ మెంట్ లేదు.

చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా…  

రీసెంట్ గా తమిళంలో ‘పటాస్’, ఇక్కడ ‘ఎంత మంచివాడవురా’ ఇప్పుడు అశ్వత్థామ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవ్వడంతో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా…