మే 8న రవితేజ 'క్రాక్' రిలీజ్

Monday,January 27,2020 - 01:14 by Z_CLU

ఇదివరకు తమ కాంబినేషనులో రెండు బ్లాక్ బస్టర్లు అందించిన మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, మూడోసారి కలిసి పనిచేస్తోన్న సినిమా ‘క్రాక్’. ఈసారి హ్యాట్రిక్ కు రెడీ అవుతోంది ఈ జోడీ. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మే 8న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇంతకుముందు రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా వస్తోంది క్రాక్.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది ‘క్రాక్’. సినిమాలో రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ను తమిళ నటులు సముత్తరఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ పోషిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘మెర్సాల్’, ‘విజిల్’ వంటి సూపర్ హిట్ తమిళ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు ‘క్రాక్’ కు డీఓపీగా పనిచేస్తున్నాడు.

నటీనటులు:
రవితేజ, శ్రుతి హాసన్, సముద్రకని, వరలక్ష్మీ శరత్ కుమార్, దేవీప్రసాద్, చిరాగ్ జాని, మౌర్యని, ‘హ్యాపీ డేస్’ సుధాకర్, వంశీ చాగంటి.

టెక్నీషియన్స్:
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
మేకప్: శ్రీనివాస రాజు
కాస్టూమ్స్: శ్వేత, నీరజ కోన
సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి
నిర్మాత: బి. మధు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
బ్యానర్: సరస్వతి ఫిలిమ్స్ డివిజన్.